MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/fighter8ce8d69d-664f-41b7-a8b1-dbca5bd7dcb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/fighter8ce8d69d-664f-41b7-a8b1-dbca5bd7dcb2-415x250-IndiaHerald.jpg‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ హిట్ కొట్టి డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మంచి జోరు మీద ఉన్నాడు. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా చిత్రం పూరి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తోంది. ఆమె తొలి తెలుగు సినిమా ఇదే. అంటే ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతోంది అన్నమాట. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ మీడియాలో సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా `ఫైటర్` సినిమా గురించి,fighter;beauty;ananya pandey;govinda;ranveer singh;ananya;geetha;govi;puri jagannadh;ram pothineni;shankar;vijay;vijay deverakonda;india;veer singhh;bollywood;cinema;arjun reddy;industry;ismart shankar;remake;director;hero;heroine;joseph vijay;arjun 1;reddy;fighter;ananya nagalla;devarakonda;santosham‘ఫైటర్’ మూవీపై బాలీవుడ్ హీరోయిన్ స్పందన ఇదీ!‘ఫైటర్’ మూవీపై బాలీవుడ్ హీరోయిన్ స్పందన ఇదీ!fighter;beauty;ananya pandey;govinda;ranveer singh;ananya;geetha;govi;puri jagannadh;ram pothineni;shankar;vijay;vijay deverakonda;india;veer singhh;bollywood;cinema;arjun reddy;industry;ismart shankar;remake;director;hero;heroine;joseph vijay;arjun 1;reddy;fighter;ananya nagalla;devarakonda;santoshamSat, 28 Nov 2020 21:21:04 GMTడైరెక్టర్ పూరీ జగన్నాథ్ మంచి జోరు మీద ఉన్నాడు. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా చిత్రం పూరిసినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తోంది. ఆమె తొలి తెలుగు సినిమా ఇదే. అంటే ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతోంది అన్నమాట. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ మీడియాలో సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా `ఫైటర్` సినిమా గురించి, సెట్లో తన ఫీలింగ్ గురించి పెదవి విప్పింది.


`నా తర్వాతి ప్రాజెక్టుల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నా. విజయ్‌ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న `ఫైటర్` షూటింగ్ జరుగుతోంది. ఇది ఓ కొత్త ప్రపంచంలా ఉంది. ఆ సినిమా సెట్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా, నేర్చుకుంటున్నా. ఈ ప్రాజెక్టులో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది` అని అనన్య పేర్కొంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరికి రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీనిలో బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ నటిస్తాడని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ‘ఫైటర్’తో బిజీగా ఉన్న రౌడీ హీరో విజయ్‌ కూడా హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విజయ్.. ఆ తర్వాత ‘గీత గోవిందం’తో కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా విజయ్ రేంజ్ హిట్ అందుకోలేదు. దీంతో విజయ్ కూడా ‘ఫైటర్’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి.


కృష్ణా నది నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల...

సామాన్యుడికి అందనంత ఎత్తులో 5G ఫోన్లు !

హీరో హరీష్ భార్య ఎవరో తెలుసా..సినిమాలు మానేసి ఏం చేస్తున్నాడు

ఆర్ఆర్ఆర్ తారక్ లుక్ రివీల్.. వీడియో మరో సంచలన రికార్డు!

సాయితేజ్ ‘సోలో లైఫే సో బెటర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

పెళ్లయ్యాక నితిన్ ఇంత స్పీడు పెంచేశాడేంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>