MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/naga-babu56d9b683-3489-4cc2-ab93-41d5bd8597c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/naga-babu56d9b683-3489-4cc2-ab93-41d5bd8597c3-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...GHMC ఎన్నికలలో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు తెలిపినందుకు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ విధానాలను తప్పుపట్టారు ప్రకాష్ రాజ్.పవన్ ఊసరవెల్లి లాంటోడని అన్నారు.అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో పవన్ అభిమానులు మండిపడుతున్నారు.ఇక తాజాగా మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు.. ప్రకాష్ రాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రకాష్ పనికిమాలిన కుసంస్కారి అని.. డబ్బుకోసం నిర్మాతల్ని హింసకు గురిచేస్తాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం నాగ బాబు పెట్టిన ఈ పోస్ట్ సోషలnaga-babu;pawan;prakash raj;kalyan;naga;raj;bharatiya janata party;india;janasena;naga aswin;media;ghmc;fire;janasena party;leader;oosaravelli;party;misterప్రకాష్ రాజ్ పై తిట్లతో రెచ్చిపోయిన మెగా బ్రదర్....ప్రకాష్ రాజ్ పై తిట్లతో రెచ్చిపోయిన మెగా బ్రదర్....naga-babu;pawan;prakash raj;kalyan;naga;raj;bharatiya janata party;india;janasena;naga aswin;media;ghmc;fire;janasena party;leader;oosaravelli;party;misterSat, 28 Nov 2020 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...GHMC ఎన్నికలలో  పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు తెలిపినందుకు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ విధానాలను తప్పుపట్టారు ప్రకాష్ రాజ్.పవన్ ఊసరవెల్లి లాంటోడని అన్నారు.అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో పవన్ అభిమానులు  మండిపడుతున్నారు.ఇక తాజాగా మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు.. ప్రకాష్ రాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రకాష్ పనికిమాలిన కుసంస్కారి అని.. డబ్బుకోసం నిర్మాతల్ని హింసకు గురిచేస్తాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం నాగ బాబు పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారుతుంది.

"రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతూ ఉంటాయి.. అయితే ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో ఒక పార్టీకి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్.. ghmc ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చేయడం వెనుక ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని మా నమ్మకం. ఎవడికి పవన్ ఖళ్యాణ్ ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు.సుబ్రహ్మణ్యం స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మిస్టర్ ప్రకాష్ రాజ్ నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్‌లోనే అర్థం అయ్యింది. సుబ్రహ్మణ్యం స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ ఉద్దేశ్యంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించు తప్పులేదు.


అలాగే బీజేపీ గాని మరే ఇతర పార్టీ గాని ప్రజలకు మంచి చేసినా హర్షించగలగాలి. విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏమి చెప్పగలను. ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీతో ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీ లాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమి శక్తిని ఎవరూ ఆపలేరు. నిర్మాతలని ఎన్ని రకాలుగా డబ్బుకోసం హింస పెట్టావో.. ఇచ్చిన డేట్స్ ని క్యాన్సిల్ చేసి ఎంత హింసకి గురిచేశావో.. ఇంకా గుర్తున్నాయి ప్రకాష్ రాజ్. ముందు నువ్వు మంచి మనిషిగా తయారయ్యి అప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి మనిషి.. నిస్వార్థపరుడైన నాయకుడిని విమర్శించు.


డైరెక్టర్స్‌ని కాకా పట్టి నిర్మాతల్ని కాల్చుకుతిన్న నీకు ఇంతకన్నా మంచిగా మట్లాడ్డం ఏమి తెలుసు. బీజేపీ నాయకత్వాన్ని నువ్వు నోటికొచ్చినట్టు విమర్శించినా నిన్ను ఎవరూ ఏమీ అనలేదంటే అది బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చేవిలువ అని అర్థం చేసుకో. బీజేపీ జనసేన ghmc ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా తమ సత్తా చాటుకోబోతున్నాయి. మీడియా అడిగింది అని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయటవేసుకోకు"అంటూ ప్రకాష్ రాజ్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చి నిప్పులు చెరిగాడు జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు... ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ పై కన్నేశాడా..?

గ్రేటర్ యుద్ధం : వాస్తుకు భయపడే వారు .. ప్రజాసేవ చేస్తారా ?

గ్రేటర్ యుద్ధం : మాటతో కాదు.. ఓటుతోనే వారికి బుద్ధి చెప్పండి..?

బుల్లిపిట్ట: గూగుల్, ఫేస్‌బుక్‌పై ఆంక్షలు?.. మార్కెట్‌పై ఆధిపత్యం తగ్గించడానికేనట!

ట్రైన్లో శోభనం ఎప్పటికి మర్చిపోలేను : చిరంజీవి

గ్రేటర్ యుద్ధం : మోడీ పర్యటనలో కేసీఆర్ షాక్.. ప్రోటోకాల్ కి తిలోదకాలు ఇచ్చి ?

గ్రేటర్ యుద్దం: జిల్లాలనుంచి దిగుతున్న వ్యూహకర్తలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>