PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/ghmc-electionsaf6443be-555e-47af-9054-e51e4aa0c38e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/ghmc-electionsaf6443be-555e-47af-9054-e51e4aa0c38e-415x250-IndiaHerald.jpgతెలంగాణలో అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ పార్టీ కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి , ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి బలం పొందుతున్నట్టు గా కనిపిస్తూ ఉండడం, ఇవన్నీ కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇంత అకస్మాత్తుగా బిజెపి బలం పుంజుకోవడానికి కారణం కూడా ఓ వ్యక్తి అనే విషయం ఇప్పుడు హైలెట్ అవుతోంది. టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ బీజేపీ కి రాజకీయ వ్యూహాలు రూపొందించే పనిలో ఉన్నారని , ఈ దూకుడుకు ఆయనే కారణమనే గుసగుసలు ఎన్నో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టిఆర్ఎస్tv9, raviprakash, trs, congress bjp,;auto;view;amala akkineni;ravi prakaash;raj;ravi anchor;bharatiya janata party;telangana rashtra samithi trs;hosta;television;letter;tv9;dookudu;partyగ్రేటర్ యుద్ధం : టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్న టీవీ 9 మాజీ ..?గ్రేటర్ యుద్ధం : టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్న టీవీ 9 మాజీ ..?tv9, raviprakash, trs, congress bjp,;auto;view;amala akkineni;ravi prakaash;raj;ravi anchor;bharatiya janata party;telangana rashtra samithi trs;hosta;television;letter;tv9;dookudu;partySat, 28 Nov 2020 01:00:00 GMTతెలంగాణలో అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ పార్టీ కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి , ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి బలం పొందుతున్నట్టు గా కనిపిస్తూ ఉండడం, ఇవన్నీ కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇంత అకస్మాత్తుగా బిజెపి బలం పుంజుకోవడానికి కారణం కూడా ఓ వ్యక్తి అనే విషయం ఇప్పుడు హైలెట్ అవుతోంది. టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ బీజేపీ కి రాజకీయ వ్యూహాలు రూపొందించే పనిలో ఉన్నారని , ఈ దూకుడుకు ఆయనే కారణమనే గుసగుసలు ఎన్నో  వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా , బీజేపీకి అనుకూలంగా రాజ్ న్యూస్ ఛానల్ లో కథనాలు వస్తుండడం వెనక రవి ప్రకాష్ హస్తం ఉందని, ఆయనే ఆ ఛానల్ ను ఇప్పుడు వెనుక నుండి నడిపిస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది.


 బిజెపికి మద్దతుగా ఇప్పుడు రాజ్ న్యూస్ ముందుకు వెళుతోంది. అయితే మరీ ఏకపక్షంగా బీజేపీ వకాల్తా పుచ్చుకోకుండా, టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను హైలెట్ చేస్తూ వస్తున్నారు. ప్రజల నాడిని పసిగట్టడం లోనూ ఏ విధంగా వార్తను ప్రజెంట్ చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనే విషయంలోనూ ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయం  రవి ప్రకాష్ బాగా తెలుసు. దీనికితోడు దుబ్బాక ఉప ఎన్నికలలో రవి ప్రకాష్ వ్యూహాలు బాగా వర్కవుట్ కావడంతో, బిజెపి ఆయనను ఫాలో అవుతున్న ట్లూ ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల లో బిజెపికి ఈ ఊపు రావడానికి రవి ప్రకాష్ సలహాలే కారణమని, అందుకే గ్రేటర్ లో ఎటువంటి ప్లాన్లు అమలు చేయాలనే విషయాలపై బిజెపి ముఖ్య నేతలు నిర్వహించిన సమావేశాలకు సైతం ఆహ్వానాలు అందుతున్న ట్టు రాజకీయవర్గాలలో ప్రచారం అవుతోంది.



 ప్రస్తుతం రాజ్ న్యూస్ కు ఫండింగ్ మొత్తం బీజేపీ నుంచే వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఎప్పుడూ లేనంతగా ఆ ఛానెల్ లో బిజెపి అనుకూలత కథనాలను వస్తున్నట్టుగా అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి. తనను టీవీ9 నుంచి ఒక ప్లాన్ ప్రకారం పంపించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉండడం, తనను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే రవి ప్రకాష్ బిజెపి కి ఊపు తెచ్చే విధంగా  వ్యవహరిస్తూ వస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



యోగి మరో సంచలనం.. కొత్త ఎత్తుగడతో సిద్ధం..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>