MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/spb4d0e85e3-7618-45ed-bb73-0ed56b00a22b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/spb4d0e85e3-7618-45ed-bb73-0ed56b00a22b-415x250-IndiaHerald.jpgభారతీయ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్. అలాగే భారతీయ దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ ఇద్దరూ లెజండరీలు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు అనదగ్గ వారు. రెండు నెలల క్రిత్రం కరోనా కారణంగా ఎస్పీ బాలు కన్నుమూసిన సంగతి విధితమే. అయితే బాలూ దాదాపు పదేళ్ళ క్రితం నటించిన ఒక మేటి చిత్ర రాజం ఇపుడు అమితాబ్ కధానాయకుడిగా బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని టాక్. spb;amitabh bachchan;bharani;lakshmi;ramana;bollywood;cinema;telugu;writer;audience;remake;wife;silver;silver screen;rekha vedavyasషాకింగ్ : బాలూ పాత్రలో అమితాబ్...?షాకింగ్ : బాలూ పాత్రలో అమితాబ్...?spb;amitabh bachchan;bharani;lakshmi;ramana;bollywood;cinema;telugu;writer;audience;remake;wife;silver;silver screen;rekha vedavyasSat, 28 Nov 2020 12:00:00 GMTఅమితాబ్ బచ్చన్. అలాగే భారతీయ దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ ఇద్దరూ లెజండరీలు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు అనదగ్గ వారు. రెండు నెలల క్రిత్రం కరోనా కారణంగా ఎస్పీ బాలు కన్నుమూసిన సంగతి విధితమే. అయితే బాలూ దాదాపు పదేళ్ళ క్రితం నటించిన ఒక మేటి చిత్ర రాజం ఇపుడు అమితాబ్ కధానాయకుడిగా బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని టాక్.

మిధునం పేరు మీద ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సినిమా తెలుగులో క్లాసిక్ గా నిలిచింది. కేవలం రెండే పాత్రలతో కధను అద్భుతంగా నడిపించాడు నటుడు, మాటల రచయిత దర్శకుడు అయిన తనికెళ్ళ్ భరణి. శ్రీ రమణ రాసిన కధను సినిమాగా ఆయన తీసి అందమైన దృశ్య కావ్యంగా మలచారు. బాలూలోని అసలైన నటుడిని అలా వెలికి తీశారు.

సినిమా చూసిన వారికి ఎక్కడా ఎస్పీ బాలు కనిపించరు. ఆయన వేసిన పాత్ర మాత్రమే కళ్ల ముందుంటుంది. ఇక లక్ష్మి సీనియర్ నటి. ఆమె నటనతో బాలూ పోటీ పడి మరీ నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఈ మూవీ ప్రతీ ఒక్కరి జీవితాన్ని తాకుతుంది. ఈ సినిమా చూసి కంటతడి పెట్టని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు, ఇక ఈ మూవీని బాలీవుడ్ లో రిమేక్ చేయడానికి ఒక నిర్మాణ సంస్థ రెడీ అవుతోందిట.

బాలూ పోషించిన పాత్రను అక్కడ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేస్తారని అంటున్నారు. ఇక లక్ష్మి చేసిన భార్య పాత్రలో రేఖ కనిపించనుందిట. ఈ ఇద్దరి కాంబో ఒకప్పుడు బాలీవుడ్ ని ఊపేసింది. మళ్ళీ ఈ ఇద్దరూ చాన్నాళ్ళకు వెండి తెర మీద కనిపించడం. ఇలాంటి బరువు పాత్రలల్లో అలరించనుండడం అంటే కచ్చితంగా ఆడియన్స్ కి  కన్నుల పంటే. మొత్తానికి బాలూ వేసిన పాత్రలో అమితాబ్ కనిపించడం అంటే అది గొప్ప విషయమే కదా.




సోనాక్షి సిన్హా: అతనే ది బెస్ట్...100 మార్కులు వచ్చాయి...!

గ్రేటర్ యుద్ధం : మోడీ పర్యటనలో కేసీఆర్ షాక్.. ప్రోటోకాల్ కి తిలోదకాలు ఇచ్చి ?

గ్రేటర్ యుద్దం: జిల్లాలనుంచి దిగుతున్న వ్యూహకర్తలు

రెడీ అయిపోయిన బిగ్ హీరోల సీక్వెల్స్.. ఫ్యాన్ప్‌కు పండుగే..

మహిళల మనసుదోచే అభరణాలు.. వాటి వెనుక సైన్స్ ఇదేనట!

నేడు ఒక్క రోజే మూడు నగరాలకు మోడీ

గ్రేటర్ యుద్దం :ఆ నాలుగు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. సీపీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>