PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccineab4e91c8-470e-4ed3-9b1f-abb54eb33d89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccineab4e91c8-470e-4ed3-9b1f-abb54eb33d89-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే రేసులో కోవిషీల్డ్ ముందువరుసలో ఉంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సహకారంతో సీరం సంస్థ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. పుణేకు చెందిన సీరం సంస్థ ఒక బిలియన్ మోతాదుల కోవిషీల్డ్ టీకా తయారీకి స్వీడిష్-బ్రిటిష్ ఫార్మా దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది. vaccine;india;university;lawyer;october;professor;indian;coronavirusసీరం వారి కోవిషీల్డ్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్.. ఆరోపించిన వాలంటీర్..!సీరం వారి కోవిషీల్డ్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్.. ఆరోపించిన వాలంటీర్..!vaccine;india;university;lawyer;october;professor;indian;coronavirusSat, 28 Nov 2020 22:00:32 GMTకరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే రేసులో కోవిషీల్డ్ ముందువరుసలో ఉంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సహకారంతో సీరం సంస్థ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. పుణేకు చెందిన సీరం సంస్థ ఒక బిలియన్ మోతాదుల కోవిషీల్డ్ టీకా తయారీకి స్వీడిష్-బ్రిటిష్ ఫార్మా దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది.

తాజాగా చెన్నైకి చెందిన 40 సంవత్సరాల వయసు కలిగిన ఓ వ్యక్తి అక్టోబర్ 1న కోవిషీల్డ్ వ్యాక్సిన అందించారు. అయితే, దీంతో చాలా దుష్ప్రభావం చూపిస్తుందని కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. దీంతో సీరం సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. వ్యాక్సిన్ వాలంటీర్ పాల్గొన్న తర్వాత “తీవ్రమైన న్యూరో ఎన్సెఫలోపతి” తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అతను, అతని కుటుంబం అనుభవించే అన్ని బాధలకు కనీసం పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని సమస్యలకు సీరం సంస్థ బాధ్యత వహించాలని తెలిపారు.

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కాకుండా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్, జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్‌కు నోటీసు పంపించారు. ప్రయోగశాల విశ్వవిద్యాలయం, శ్రీ రామచంద్ర ఉన్నత, పరిశోధన వైస్-ఛాన్సలర్, అక్కడ పాల్గొనేవారికి ప్రయోగ వ్యాక్సిన్‌ను అందించారు. ఈ ప్రయోగాల్లో పాల్గొన్నవారిలో తలనొప్పితో బాధపడుతున్నారని, ఆపై ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఏడు రోజుల పాటు బస చేశారని లీగల్ నోటీసు పేర్కొంది. అతను అనుభవిస్తున్న అన్ని బాధలకు, అతని ఆరోగ్యానికి అనిశ్చిత రావాలంటే, ఈ నోటీసు అందినప్పటి నుండి రెండు వారాల వ్యవధిలో అతనికి రూ. 5కోట్లు ఆర్థిక పరిహారం ఇవ్వాలి” అని నోటీసు వెల్లడించారు.

అయితే, మేము నోటీసు పంపిన పార్టీల నుండి మాకు ఎటువంటి స్పందన రాలేదు. ముందుకు వెళ్లి రిట్ పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండడం తప్ప మాకు వేరే మార్గం లేకుండా పోతుందని బాధితుడి తరపున న్యాయవాది ఆర్. రాజారామ్ అన్నారు. కాగా, ఈ నోటీసులకు సంబంధించి సీరం సంస్థ గానీ, ఐసిఎంఆర్, డిసిజిఐ, ఆస్ట్రాజెనెకా అండ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కాని స్పందించలేదు.


ముంచుకొస్తున్న మరొక తుఫాన్ ముప్పుపై మంత్రి బొత్స సమీక్ష...

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!

గ్రేటర్ యుద్ధం: 100 సీట్లు మావేనన్న కవిత!

తన సుఖం కోసం కొడుకును అతి దారుణంగా చంపిన కసాయి తల్లి.. చివరికి

బికినీలో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న యంగ్ హీరోయిన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>