MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi7173d472-fd63-4e45-94db-958acce8aa95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi7173d472-fd63-4e45-94db-958acce8aa95-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన సినిమాల విషయంలో స్పీడ్ పెంచేసాడు. పేరుకు సీనియర్ హీరోనే అయినా.. యంగ్ హీరోల కంటే వేగంగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య'సినిమాలో నటిస్తున్న చిరూ.. ఆ తర్వాత వరుస చిత్రాలతో బిజీగా మారిపోనున్నాడు.ఆచార్య సినిమా సెట్స్ పై ఉండగానే దాదాపు రెండు ప్రాజెక్టులను కన్ఫర్మ్ చేసాడు మెగాస్టార్. అవి రెండూ కూడా రిమేక్ సినిమాలు కావడం విశేషం. ఇక తాజా సమాచారం ప్రకారం ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో హిట్టయmegastar chiranjeevi;beauty;chiranjeevi;shiva;editor mohan;kajal aggarwal;koratala siva;sujeeth;hyderabad;ram madhav;tollywood;cinema;telugu;tamil;konidela production;marriage;interview;remake;director;lord siva;good news;heroine;research and analysis wing;good newwzమెగాస్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చిరంజీవి లూసిఫార్ రీమేక్ కి డైరెక్టర్ ఫిక్స్..??మెగాస్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చిరంజీవి లూసిఫార్ రీమేక్ కి డైరెక్టర్ ఫిక్స్..??megastar chiranjeevi;beauty;chiranjeevi;shiva;editor mohan;kajal aggarwal;koratala siva;sujeeth;hyderabad;ram madhav;tollywood;cinema;telugu;tamil;konidela production;marriage;interview;remake;director;lord siva;good news;heroine;research and analysis wing;good newwzFri, 27 Nov 2020 16:00:00 GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన సినిమాల విషయంలో స్పీడ్ పెంచేసాడు. పేరుకు సీనియర్ హీరోనే అయినా.. యంగ్ హీరోల కంటే వేగంగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య'సినిమాలో నటిస్తున్న చిరూ.. ఆ తర్వాత వరుస చిత్రాలతో బిజీగా మారిపోనున్నాడు.ఆచార్య సినిమా సెట్స్ పై ఉండగానే దాదాపు రెండు ప్రాజెక్టులను కన్ఫర్మ్ చేసాడు మెగాస్టార్. అవి రెండూ కూడా రిమేక్ సినిమాలు కావడం విశేషం. ఇక తాజా సమాచారం ప్రకారం ఆచార్య సినిమా తర్వాత  మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' మూవిని రీమేక్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గా మెగాస్టార్ చాలా పేర్లనే పరిశీలించారు.

మొదటగా సాహూ ఫేం సుజిత్ పేరు వినిపించింది. ఆ తర్వాత వినాయక్ లైన్లోకి వచ్చాడు. లూసిఫర్ రీమేక్ ను తానే డైరెక్ట్ చేస్తున్నట్టు వినాయక్ ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించాడు. కాగా ఆ తరవాత వినాయక్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి తపుకున్నట్టు వార్తలు వచ్చాయి.దాంతో లూసిఫర్ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నదానిపై మరోసారి చర్చ మొదలయ్యింది. తాజా సమాచారం ప్రకారం లూసిఫర్ తమిళ దర్శకుడు మోహన్ రాజానే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.లూసిఫర్ రీమేకును కూడా రాంచరణ్ నిర్మాతగా కొణిదెల బ్యానర్ లో తెరకెక్కించనున్నారు. సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణను లూసిఫర్ రీమేక్ లో మెగాస్టార్ సోదరిగా నటింంపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 తెలుగులో కూడా ఈ సినిమాను హీరోయిన్ లేకుండానే తీస్తున్నట్టు సమాచారం.ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ షూటింగ్ లో మెగాస్టార్ కూడా జాయిన్ అయ్యారు. సినిమాలో చిరూ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.ఏఈమె కూడా ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ కావాల్సింది కానీ.. ఈ మధ్యే ఈ అమ్మడికి పెళ్లి కావడం.. ఆ తర్వాత హానీమూన్ వెళ్లడంతో.. కాస్త ఆలస్యంగా షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టనుంది కాజల్...!!


హైకోర్ట్ కే షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

షూటింగ్ లో ఆ పని చేస్తూ నితిన్ కి దొరికిపోయిన కీర్తీ సురేష్..??

గ్రేటర్ యుద్దం : "ఇవి ఎన్నికల లేక జాతర నా.." బి‌జే‌పి మీద పొన్నాల సెటైర్లు !!

జగన్ కు అచ్చెన్న లేఖ... ఎందుకంటే

9 రోజుల పాటు పస్తులు .. మంచినీళ్లు తాగి..సునీల్ కష్టాలు చూడండి

గ్రేటర్ యుద్ధం: అభ్యర్థుల్ని బరిలోనుంచి తప్పించేందుకు కుట్రలు..

సరిహద్దుల్లో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్.. అమరుడైన భారత ఆర్మీ సుబేదార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>