PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-electionsbb8dc21a-a4ba-4ed1-a3fe-cc14f36c369d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-electionsbb8dc21a-a4ba-4ed1-a3fe-cc14f36c369d-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఎన్నికల సంఘం సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. ఎన్నికల సంఘం ప్రచారం విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. రాజకీయంగా ఈ ఎన్నికలు చాలా కీలకంగా ఉన్న నేపధ్యంలో ఎన్నికల సంఘం ప్రతీ ఒక్క విషయాన్ని చాలా వరకు కూడా జాగ్రత్తగా చూస్తుంది. డిసెంబర్ ఒకటిన ఎన్నికల నిర్వహణ ఉంటుంది. 4 న ఫలితాలు రానున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పలు సూచనలు చేస్తుంది. తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా, జిహెచ్ఎంసి ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల అgreater;hyderabad;decemberగ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలుగ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలుgreater;hyderabad;decemberFri, 27 Nov 2020 20:45:00 GMTహైదరాబాద్ ఎన్నికలను ఎన్నికల సంఘం సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. ఎన్నికల సంఘం ప్రచారం విషయంలో చాలా వరకు కూడా  జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. రాజకీయంగా ఈ ఎన్నికలు చాలా కీలకంగా ఉన్న నేపధ్యంలో ఎన్నికల సంఘం ప్రతీ ఒక్క విషయాన్ని చాలా వరకు కూడా జాగ్రత్తగా చూస్తుంది. డిసెంబర్ ఒకటిన ఎన్నికల నిర్వహణ ఉంటుంది. 4 న ఫలితాలు రానున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పలు సూచనలు చేస్తుంది. తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా, జిహెచ్ఎంసి ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల అధికారి మరియు జిహెచ్ఎంసి కమిషనర్ ఈ క్రింది కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది అని ఎన్నికల సంఘం పేర్కొంది.

కోవిడ్-19 కు సంబంధించిన ఏర్పాట్లు మరియు ముందు జాగ్రత్త చర్యల పర్యవేక్షణ కొరకు జిహెచ్ఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసరును కమిషనరేట్ స్థాయిలో, 30 సర్కిళ్ళలోని సహాయ వైద్య అధికారులను సర్కిల్ స్థాయిలో కోవిడ్ నోడల్ అధికారులుగా నియమిస్తూ, సర్కిల్ లెవల్ అధికారులను వార్డు స్థాయి కోవిడ్ అధికారులను నియమించాల్సిందిగా ఆదేశించడమైనది అని ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. లక్షా 20 వేల కిట్లను 30 సర్కిల్ కార్యాలయములకు ఆయా సర్కిళ్ళలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా సరఫరా చేయడం జరుగుతుంది అని వెల్లడించింది.

ఒక్కో పోలింగ్ కేంద్రానికి 10 కిట్లు ఎన్నికల విధులు నిర్వహించే వారి కొరకు అందజేయబడుతుంది అని స్పష్టం చేసింది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 500 మి.లీ ల శానిటైజర్లు 5 చొప్పున అందించేందుకు 60,000 శానిటైజర్లు సిద్ధం చేయడం జరిగింది అని ఎన్నికల సంఘం వెల్లడించింది. నోడల్ వైద్య అధికారులు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా, శానిటైజర్లు ఉపయోగించేలా, మాస్కులు ధరించేలా చూడాలని ఎన్నికల సంఘం సూచనలు చేసింది.


మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!

నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?

రేపే జగన్ కీలక పర్యటన

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..

‘పుష్ప’ తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా? తొలిసారి ఆ పాత్రలో?

బిగ్ బాస్ 4 : అరియానా ఒంటరిపోరాటం.. దేవి ఉండుంటే సీన్ వేరేలా ఉండేదా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>