PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi81d41947-0a15-4f4d-8799-9a904441c29c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi81d41947-0a15-4f4d-8799-9a904441c29c-415x250-IndiaHerald.jpgఇంటర్నెట్ డెస్క్: జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమిలి ఎన్నికల కాన్సెప్ట్ తెరమీదకొచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. దేశంలో జమిలి ఎన్నికలు అవసరమని, జమిలి ఎన్నికల వల్ల ఆర్థికంగా దేశానికి లాభమే కాకుండా.. సమయం కూడా కలిసొస్తుందని, దేశం మరింత ముందుకు వెళుతుందని మోదీ ఎన్నో సమావేశాల్లో చెప్పారు.modi;bharatiya janata party;apple;narendra modi;prime minister;loksabha;assembly;wife;letter;local language;central government;european union;custard apple;narendraజమిలిపై మళ్లీ మాట్లాడిన మోదీ.. ఏమన్నారంటే..జమిలిపై మళ్లీ మాట్లాడిన మోదీ.. ఏమన్నారంటే..modi;bharatiya janata party;apple;narendra modi;prime minister;loksabha;assembly;wife;letter;local language;central government;european union;custard apple;narendraFri, 27 Nov 2020 11:02:54 GMTఇంటర్నెట్ డెస్క్: జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చినప్పటి నుంచీ జమిలి ఎన్నికల కాన్సెప్ట్ తెరమీదకొచ్చింది. దీనిపై
ప్రధాని నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. దేశంలో జమిలి
ఎన్నికలు అవసరమని, జమిలి ఎన్నికల వల్ల ఆర్థికంగా దేశానికి లాభమే
కాకుండా.. సమయం కూడా కలిసొస్తుందని, దేశం మరింత ముందుకు వెళుతుందని మోదీ
ఎన్నో సమావేశాల్లో చెప్పారు.

ఈ రోజు జరిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన
కార్యక్రమంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని మళ్లీ
ప్రస్తావించారు. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలపై
ఎలాంటి చర్చా అవసరం లేదని, దేశానికి ఈ ఎన్నికలు అత్యంత ఆవశ్యకమని నొక్కి
చెప్పారు. అసెంబ్లీ, స్థానిక సంస్థలు, లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల
సంఘం వేర్వేరు ఓటరు జాబితాలను రూపొందిస్తోందని, అలా రూపొందించడం అంటే
వనరులను వృథా చేయడమే అని ఆయన అభిప్రాయపడ్డారు.

80వ ‘ఆలిండియా ప్రిసైడింగ్స్ ఆఫీసర్స్’ జాతీయ సదస్సును ప్రధాని మోదీ
గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.. ఆ ప్రసంగంలో
భాగంగా ‘‘జమిలి ఎన్నికలపై చర్చ అనవసరం. దేశానికి అవి అత్యంత ఆవశ్యకం.
కొన్ని నెలల వ్యత్యాసాల్లోనే దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే
ఉంటున్నాయి. దీంతో అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ
విషయం ప్రజానీకానికి అర్థమవుతూనే ఉంది. సమస్యను అధ్యయనం చేయాల్సిన అవసరం
ఉంది. దీనిపై ప్రిసైడింగ్ అధికారులు తగిన మార్గదర్శనం చేయాల్సిన ఆవశ్యకం
ఉంది.’’ అని మోదీ పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై ప్రధాని మళ్లీ నోరు
విప్పడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఏం జరుగుతుందో వేచి
చూడాలి. 


హైదరాబాద్‌లో కేజీఎఫ్ హీరో.. డిసెంబర్ వరకూ ఇక్కడే..

గ్రేటర్ యుద్ధం : జూబ్లీహిల్స్ టీడీపీ అభ్యర్ధి ప్రత్యేకం.. ఎందుకో తెలుసా

గ్రేటర్ యుద్దం : మేనిఫెస్టో ప్రకటించకపోవడానికి కారణాలు చెప్పిన మజ్లిస్ పార్టీ

న్యూజీల్యాండ్ టూర్‌కు పాక్ ఆటగాళ్లు.. ఆరుగురికి కరోనా

బిగ్ బాస్ 12 వారాల్లో జరిగిన వింతలు ..ఇవి మీరు గమనించారా..?

అమ్మలందరికీ ఓపెన్ లెటర్.. టెన్నిస్ స్టార్ సానియా మాటలివీ!

గ్రేటర్ యుద్ధం : దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారు : విజయశాంతి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>