SportsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/newzealand609436fb-3dd9-4009-b16f-fc469c306491-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/newzealand609436fb-3dd9-4009-b16f-fc469c306491-415x250-IndiaHerald.jpgవెల్లింగ్టన్: ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న ఏకైక దేశంగా న్యూజీల్యాండ్ రికార్డు సృష్టించింది. వ్యాక్సిన్ రాకముందే జీరో కేసులతో శభాష్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలోనే క్రీడలను కూడా ప్రారంభించేసింది. స్టేడియాలలోకి ప్రేక్షకులనూ పూర్తి స్థాయిలో అనుమతించేసింది. దీంతో అక్కడి స్టేడియాలన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి.newzealand;amala akkineni;cricket;apple;pakistan;new zealand;letter;european union;custard apple;zeroన్యూజీల్యాండ్ టూర్‌కు పాక్ ఆటగాళ్లు.. ఆరుగురికి కరోనాన్యూజీల్యాండ్ టూర్‌కు పాక్ ఆటగాళ్లు.. ఆరుగురికి కరోనాnewzealand;amala akkineni;cricket;apple;pakistan;new zealand;letter;european union;custard apple;zeroFri, 27 Nov 2020 10:46:06 GMTవెల్లింగ్టన్: ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న ఏకైక
దేశంగా న్యూజీల్యాండ్ రికార్డు సృష్టించింది. వ్యాక్సిన్ రాకముందే జీరో
కేసులతో శభాష్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలోనే క్రీడలను కూడా
ప్రారంభించేసింది. స్టేడియాలలోకి ప్రేక్షకులనూ పూర్తి స్థాయిలో
అనుమతించేసింది. దీంతో అక్కడి స్టేడియాలన్నీ ప్రేక్షకులతో
కిక్కిరిసిపోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే పాకీస్తాన్‌తో 3 టీ20లు, 2 టెస్టుల సిరీస్ ఆడేందుకు
న్యూజీల్యాండ్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. అందులో భాగంగా పాక్ ఆటగాళ్లు
న్యూజీల్యాండ్ కూడా చేరుకున్నారు. అయితే ఊహించని విధంగా సిరీస్ కోసం
వచ్చిన పాక్ ఆటగాళ్లకు కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి
కరోనా పాజిటివ్ తేలింది. దీంతో సిరీస్ న్యూజీల్యాండ్ క్రికెట్ బోర్డు
అవాక్కయింది.

ఆటగాళ్లు లాహోర్‌లో బయలుదేరినప్పుడు 53 మంది సభ్యుల బృందం వారిని
పరీక్షించిందని, ఈ నెల 24న క్రైస్ట్‌చర్చ్ చేరుకున్న తర్వాత కూడా వారిని
పరీక్షించినట్టు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిని
కనీసం మరో 4 సార్లు పరీక్షించనున్నట్టు పేర్కొంది.

గదుల్లో ఉన్న చాలామంది ఆటగాళ్లు ఐసోలేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు
తమకు తెలిసిందని, వారికి ఫైనల్ వార్నింగ్ ఇస్తామని కివీస్ బోర్డు
చెప్పింది. పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ రావడం సంతోషకరంగా ఉన్నా..
ఇక్కడికి చేరుకున్న తరువాత తాము విధించే కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా
పాటించాల్సిందేనని ఆరోగ్య అధికారి ఆష్లీ బ్లూమ్‌ఫీల్డ్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కరోనాను సమూలంగా నిర్మూలించిన న్యూజిలాండ్‌లో విదేశీ
ఆటగాళ్లకు కరోనా సోకడం ఇప్పుడు అక్కడ కలకలం రేపుతోంది. దీంతో వెంటనే పాక్
ఆటగాళ్లందరినీ క్యారంటైన్‌కు తరలించినట్లు కివీస్ బోర్డు తెలిపింది.
వారందరినీ కఠిన క్వారంటైన్‌లో ఉంచనున్నామని, నిబంధనలను పక్కాగా
అమలుపరుస్తామని వెల్లడించింది. దీంతో ఆటగాళ్లు ప్రస్తుతం వారి గదులకే
పరిమితమై ఉండనున్నారు. 


ఇలాంటి లాజిక్ లు వేస్తే బీజేపీ ని ఏమీ చేయలేము..?

బిగ్ బాస్ 12 వారాల్లో జరిగిన వింతలు ..ఇవి మీరు గమనించారా..?

అమ్మలందరికీ ఓపెన్ లెటర్.. టెన్నిస్ స్టార్ సానియా మాటలివీ!

గ్రేటర్ యుద్ధం : దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారు : విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్దం : ప్రచారంలో స్టేజ్ పై నుండి కింద పడ్డ ఎమ్మెల్యే..!!

గ్రేటర్ యుద్ధం : మోడీ మోళీ చేస్తారా ?

గల్లీ ఎలక్షన్స్ కోసం.. ఢిల్లీ నేతలా.. ఇది మరీ విడ్డూరం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>