PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/pawankalyan-janasena-bjp-nadda-delhi-tirupati-pola5cee33a5-7511-4e28-9417-0190010cd8ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/pawankalyan-janasena-bjp-nadda-delhi-tirupati-pola5cee33a5-7511-4e28-9417-0190010cd8ef-415x250-IndiaHerald.jpgనివర్ తుపాన్ తో.. రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సుమారు రూ. వెయ్యి కోట్ల మేర పంట నష్టం కలిగినట్లు సమాచారం అందింది అన్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతాంగం దెబ్బ తింది అని వెల్లడించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో రైతులకు ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు అని వెల్లడించారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది అని ఆయన అన్నారు. అప్పుల పాలైపోతున్న రైతులను మరింతpawan kalyan;pawan;kalyan;prakruti;krishna river;janasena;kadapa;government;janasena partyపవన్ కళ్యాణ్ ఆవేదన...!పవన్ కళ్యాణ్ ఆవేదన...!pawan kalyan;pawan;kalyan;prakruti;krishna river;janasena;kadapa;government;janasena partyFri, 27 Nov 2020 17:36:57 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.  సుమారు రూ. వెయ్యి కోట్ల మేర పంట నష్టం కలిగినట్లు సమాచారం అందింది అన్నారు.  పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతాంగం దెబ్బ తింది అని వెల్లడించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో రైతులకు ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు అని వెల్లడించారు.   రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది అని ఆయన అన్నారు.

అప్పుల పాలైపోతున్న రైతులను మరింత కుంగదీసే విధంగా ఈ నష్టాలు ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు.  పెట్టుబడి రాయితీతోపాటు పంటల బీమాను సకాలంలో అందించాలని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఖరీఫ్, రబీ పంటల నష్టానికి సంబంధించిన బీమా మొత్తాలు ఇప్పటికీ దెబ్బ తిన్న రైతులకు అందలేదు అని పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ తగిన విధంగా స్పందించాలి అని, నివర్ తుపాన్ కంటే ముందు భారీ వర్షాలు, వరదల మూలంగా రైతాంగం నష్టపోయింది అని పేర్కొన్నారు. ఇప్పుడు నివర్ మరింత దెబ్బ తీసింది అని ఆయన అన్నారు.

 పంటలు కోల్పోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందచేస్తే చాలని ఆయన పేర్కొన్నారు.  వ్యవసాయం చేసేవారికి ధీమా కలుగుతుంది అని పవన్ వ్యాఖ్యానించారు. నివర్ తుపాన్ మూలంగా ఇళ్ళల్లోకి నీళ్ళు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  నిరాశ్రయులుగా మిగిలిన వారిని తక్షణమే ఆదుకొనే చర్యలను ప్రభుత్వం చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగించాలి అని ఆయన పేర్కొన్నారు.  రాబోయే కొద్ది రోజుల్లో మరో తుపాన్ పొంచి ఉందని తెలుస్తోంది అని, ప్రజలను ముందుగా అప్రమత్తం చేసే చర్యల్లో జనసైనికులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన అన్నారు.


అమరావతి విషయంలో ఏపీ కేబినేట్ కీలక నిర్ణయం

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ విజయం ఖాయమన్న ఎమ్మెల్యే బాల్‌రాజ్

వేరే లెవల్ లో రౌడీ హీరో మూవీ.. సుకుమార్ సూపర్ స్కెచ్..!

షూటింగ్ లో ఆ పని చేస్తూ నితిన్ కి దొరికిపోయిన కీర్తీ సురేష్..??

గ్రేటర్ యుద్దం : "ఇవి ఎన్నికల లేక జాతర నా.." బి‌జే‌పి మీద పొన్నాల సెటైర్లు !!

జగన్ కు అచ్చెన్న లేఖ... ఎందుకంటే

9 రోజుల పాటు పస్తులు .. మంచినీళ్లు తాగి..సునీల్ కష్టాలు చూడండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>