MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poojahegdebd72d980-d9b2-4ddf-9bee-e2ff78056278-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poojahegdebd72d980-d9b2-4ddf-9bee-e2ff78056278-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మంచి జోరు మీద ఉంది. వరుస పెట్టి సినిమాలు చేసేస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది. తెలుగులోనే కాదు హిందీలో కూడా సినిమాలు ఒప్పుకుంటూ యమ స్పీడు చూపిస్తోంది. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ టైం అంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ పూజ ఎందుకింత ఎగ్జయిట్ అవుతుందో తెలుసా? ఆమె అభిమాన హీరోలో హీరోయిన్‌గా నటించే అవకాశం దొరికినందుకే. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్poojahegde;pooja hegde;salman khan;rani;bollywood;tollywood;cinema;telugu;hindi;director;hero;heroine;mukunda;chitramఫేవరెట్ హీరో సినిమాలో ఛాన్స్.. ఫుల్ జోష్‌లో బుట్టబొమ్మ పూజ!ఫేవరెట్ హీరో సినిమాలో ఛాన్స్.. ఫుల్ జోష్‌లో బుట్టబొమ్మ పూజ!poojahegde;pooja hegde;salman khan;rani;bollywood;tollywood;cinema;telugu;hindi;director;hero;heroine;mukunda;chitramFri, 27 Nov 2020 14:08:07 GMTటాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మంచి జోరు మీద ఉంది. వరుస పెట్టి సినిమాలు చేసేస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది. తెలుగులోనే కాదు హిందీలో కూడా సినిమాలు ఒప్పుకుంటూ యమ స్పీడు చూపిస్తోంది. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ టైం అంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ పూజ ఎందుకింత ఎగ్జయిట్ అవుతుందో తెలుసా? ఆమె అభిమాన హీరోలో హీరోయిన్‌గా నటించే అవకాశం  దొరికినందుకే. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. తెలుగులో వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ముకుంద’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన పూజ.. ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలో తన అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంది.

 అనుకున్నట్లే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి నటించే అవకాశం కొట్టేసింది. హృతిక్‌తో కలిసి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ ‘మొహంజదారో’లో నటించింది. దీనికోసం కెరీర్ పీక్స్‌లో ఉండగా రెండేళ్లు కాల్‌షీట్స్ కేటాయించింది కూడా. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బాలీవుడ్‌లో ఆమె కెరీర్‌పై మచ్చలా మారిపోయింది. అయితే ఆ తర్వాత తేరుకున్న పూజ.. గతేడాది ‘హౌస్‌ఫుల్ 4’లో నటించింది. ఈ చిత్రం ఆమెకు భారీ విజయాన్ని కట్టబెట్టింది.

ఇప్పుడు అదే ఊపులో సల్మాన్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. సల్మాన్ త్వరలో చేయబోతున్న ‘కభీ ఈద్.. కబీ దివాలీ’’ చిత్రంలో పూజనే హీరోయిన్ అట. ఈ విషయం తెలియడంతో పూజ సంతోషానికి హద్దు లేకుండా పోయింది. తన కెరీర్‌లో ఇదే అత్యంత హ్యాపీ మూమెంట్ అని ఆమె చెప్తోంది. జోరు మీద ఉన్న పూజ కెరీర్‌లో ఇంకా ఎన్ని భారీ చిత్రాలు చేరతాయో చూడాలి మరి. హిందీలో కూడా వరుస పెట్టి ఆఫర్లు రావడం మాత్రం కచ్చితంగా మన బుట్ట బొమ్మ ట్యాలెంటే.


ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న వాయు కాలుష్యం

గ్రేటర్ యుద్ధం : టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే మైనంపల్లి..?

రెడీ అయిన కరోనా వ్యాక్సిన్..తొలి దశలో 30 కోట్ల మందికి..!!

గ్రేటర్ యుద్ధం : టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా మంత్రులు మల్లారెడ్డి, ఈటెల..?

గ్రేటర్ యుద్ధం : చింతల్ డివిజన్ లో ప్రచారం లో దూసుకుపోతున్న టీఆర్ఎస్..?

రోహిత్ శర్మ లేకపోతే ఏంటి.. అతను ఉన్నాడు..?

బుల్లిపిట్ట: గూగుల్ పే యూజర్లకు శుభవార్త.. అసలు విషయం చెప్పిన గూగుల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>