PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr2fb00665-b6da-4d12-961b-6e53d9701afc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr2fb00665-b6da-4d12-961b-6e53d9701afc-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో కేసీఆర్ పాలనా పై అందరికి నమ్మకం సడలిపోతుంది.. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయన తెచ్చిన కొన్ని మార్పులు ఆయన కు ఈ దుర్గతి పట్టించాయని అంటున్నారు..అయన పాలన ఇప్పటివరకు ఒకలా ఉండగా ఇప్పటినుంచి ఒకలా ఉంటుందని అందుకే ఆయనపై ప్రజలు నమ్మకాన్ని వదిలేశారు అని అంటున్నారు... ఇన్ని రోజులు కేసీఆర్ కి ఎదురులేదు.. ప్రతిపక్ష నాయకులూ కూడా అంతంత మాత్రంగా నే ఉండడంతో కేసీఆర్ ఆడిందే ఆట అయిపోయింది.. kcr;kcr;audi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;mp;media;success;partyకేసీఆర్ ఫెయిల్యూర్ బీజేపీ కి వరాలుగా మారాయా..?కేసీఆర్ ఫెయిల్యూర్ బీజేపీ కి వరాలుగా మారాయా..?kcr;kcr;audi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;mp;media;success;partyFri, 27 Nov 2020 18:30:00 GMTతెలంగాణ లో కేసీఆర్ పాలనా పై అందరికి నమ్మకం సడలిపోతుంది.. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయన తెచ్చిన కొన్ని మార్పులు ఆయన కు ఈ దుర్గతి పట్టించాయని అంటున్నారు..అయన పాలన ఇప్పటివరకు ఒకలా ఉండగా ఇప్పటినుంచి ఒకలా ఉంటుందని అందుకే ఆయనపై ప్రజలు నమ్మకాన్ని వదిలేశారు అని అంటున్నారు... ఇన్ని రోజులు కేసీఆర్ కి ఎదురులేదు.. ప్రతిపక్ష నాయకులూ కూడా అంతంత మాత్రంగా నే ఉండడంతో కేసీఆర్ ఆడిందే ఆట అయిపోయింది..

కానీ ఇప్పుడు బీజేపీ కేసీఆర్ కి సరైన ప్రత్యగా కనిపిస్తుంది.. ఇప్పటికే నాలుగు ఎంపీ సీట్లు గెలవగా ఇటీవలే దుబ్బాకలోనూ కేసీఆర్ కి పెద్ద షాక్ ఇచ్చింది..ఈ గెలుపులతో బీజేపీ కి కొత్త ఉత్సాహం వచ్చినట్లయ్యింది. ఎప్పటినుంచి తెలంగాణ లో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది.. దానికి తోడు బండి సంజయ్ కూడా ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు.. గ్రేటర్ లో తమదే గెలుపు అన్నట్లు వ్యవహరిస్తున్నారు..

గ్రేటర్ లో గెలవడాన్నికి బండి సంజయ్ హైదరాబాద్‌ ప్రజల్లో నిద్రాణంగా ఉన్న ఓ సెంటిమెంట్‌ను మేల్కొలుపుతున్నారు. నిన్నటిదాకా జై తెలంగాణ అంటే.. టీఆర్ఎస్ నినాదంలా ఉండేది. తెలంగాణ కోసం టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలన్నంతగా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఉండేది. ఎవరైనా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై తెలంగాణ వ్యతిరేకుల ముద్ర వేసేవారు. కొన్ని పార్టీల్ని అలాగే తరిమేశారు. దాన్ని పూర్తి గా టీ ఆర్ ఎస్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మజ్లీస్ ను పెంచి పోస్తున్న కేసీఆర్ ను విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత కేసీఆర్ అన్ని విషయాల్లో పనికిరాని నేతగా చిత్రీకరించడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది.. మొత్తానికి బీజేపీ పార్టీ కేసీఆర్ బాటలోనే వెళుతూ కేసీఆర్ ని ముంచేస్తుందని చెప్పొచ్చు..


మంత్రులకు కేసీఆర్ ఫోన్... కేబినేట్ నుంచి అవుట్...?

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!

నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?

రేపే జగన్ కీలక పర్యటన

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>