PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr143f639b-23ab-474d-be14-f7a9062a90b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr143f639b-23ab-474d-be14-f7a9062a90b1-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో గ్రేటరెన్నికల పోలింగ్ తేదీ దగ్గరికొస్తున్న కొద్దీ అన్ని పార్టీ లు ప్రచారాల జోరును పెంచింది. మేనిఫెస్టో ల హామీలతో ఇప్పటికే ప్రజలను ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న పార్టీ లు ఇప్పుడు ప్రచారంలో తుది అంకానికి చేరుకున్నాయని చెప్పొచ్చు.. ఓ వైపు పోలింగ్ తేదీ దగ్గరకొస్తుండడంతో అన్ని పార్టీ తమదే గెలుపు అని తేల్చి చెప్తున్నాయి. ముఖ్యంగా దెబ్బకు ఓటమితో కేసీఆర్ ఇక్కడ గెలిచి ఆ ఓటమి బాధను తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అయన ఈ ఎన్నికలను ఏ మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నkcr;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;assembly;central government;partyగ్రేటర్ లో టీ ఆర్ ఎస్ ప్రధానాయుధం ఇదే..?గ్రేటర్ లో టీ ఆర్ ఎస్ ప్రధానాయుధం ఇదే..?kcr;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;assembly;central government;partyFri, 27 Nov 2020 23:00:00 GMTపార్టీ లు ప్రచారాల జోరును పెంచింది. మేనిఫెస్టో ల హామీలతో ఇప్పటికే ప్రజలను ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న పార్టీ లు ఇప్పుడు ప్రచారంలో తుది అంకానికి చేరుకున్నాయని చెప్పొచ్చు.. ఓ వైపు పోలింగ్ తేదీ దగ్గరకొస్తుండడంతో అన్ని పార్టీ తమదే గెలుపు అని తేల్చి చెప్తున్నాయి. ముఖ్యంగా దెబ్బకు ఓటమితో కేసీఆర్ ఇక్కడ గెలిచి ఆ ఓటమి బాధను తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అయన ఈ ఎన్నికలను  ఏ మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్ లో ఇప్పటికే కొంత బ్యాడ్ నేమ్ వరదల రూపంలో ముంచెత్తింది.. దాన్ని కవర్ చేసుకోవాలంటే గతంలో కంటే ఎక్కువగా పనిచేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు కాబట్టే మేనిఫెస్టో లో హైదరాబాద్ ప్రజలకు వరాలు కురిపించారు. ఇప్పటికే అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో  ప్రచారానికి వెళ్లని కేసీఆర్ కి అక్కడి ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయితే ఇప్పుడు కూడా తాను రంగంలోకి దిగి ప్రచారం చేయకపోతే పార్టీ కి ఎదురుదెబ్బ తగులుతుందని భావించి గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. చివరి రోజు అయన ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ఇక టీ ఆర్ ఎస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ వారి ప్రచారాస్త్రం మాత్రం సేఫ్ సిటీ అనే నినాదం అని తెలుస్తుంది. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతం కేంద్రంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సై అంటే సై అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో రక్తికట్టిస్తున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ పైనా కత్తులు నూరుతున్నాయి.  నిజానికి హైదరాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా మత పరమైన కలహాలు చోటుచేసుకోలేదు. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ భావించింది. బీజేపీ కూడా అందుకు సహకరిస్తూ మైనార్టీలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తుంది.. అది టీ ఆర్ ఎస్ కు లభిస్తుంది చెప్పడంలో ఏ సందేహం లేదు.


ఈ సీజన్ బెస్ట్ కెప్టెన్ హారిక.. వరస్ట్ కెప్టెన్ అరియానా..!

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>