ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/ghmc-war402db288-bba3-4447-923c-a009822fdccb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/ghmc-war402db288-bba3-4447-923c-a009822fdccb-415x250-IndiaHerald.jpgఇటీవలే పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించటం కొన్ని వర్గాలకి నచ్చక దానిపై తమ అసంతృప్తిని తెలియజేశారు. ఇప్పుడు ఈ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పూటకో మాట మార్చే ఊసరవల్లి అని వ్యాఖ్యానించారు. అభిమానులు, కార్యకర్తలకు బీజేపీకి ఓటెయ్యాలని చెబితే ఇక జనసేన ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ghmc-war;pawan;kcr;prakash raj;indra;jeevitha rajaseskhar;kalyan;raj;bharatiya janata party;telangana;janasena;congress;media;interview;hero;gift;janasena party;nijam;leader;partyగ్రేటర్ యుద్ధం : పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్...గ్రేటర్ యుద్ధం : పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్...ghmc-war;pawan;kcr;prakash raj;indra;jeevitha rajaseskhar;kalyan;raj;bharatiya janata party;telangana;janasena;congress;media;interview;hero;gift;janasena party;nijam;leader;partyFri, 27 Nov 2020 17:45:00 GMTపవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ సినిమాలలో హీరో, విలన్లలా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. అయితే నిజ జీవితంలో మాత్రం ప్రకాష్ రాజ్ కు ఇష్టమైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు అని ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇక ప్రకాష్ రాజ్ గతంలోనే కాకుండా సందర్భం వచ్చిన ప్రతీసారి బీజేపీపై తనకు గల వ్యతిరేకతను ఎప్పటికప్పుడు చూపిస్తూ చర్చల్లో నిలుస్తారన్న సంగతి తెలిసిందే...  అలాగే ఇటీవలే పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించటం కొన్ని వర్గాలకి నచ్చక దానిపై తమ అసంతృప్తిని తెలియజేశారు. ఇప్పుడు ఈ విలక్షణ నటుడు  ప్రకాష్ రాజ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పూటకో మాట మార్చే ఊసరవల్లి అని వ్యాఖ్యానించారు. అభిమానులు, కార్యకర్తలకు బీజేపీకి ఓటెయ్యాలని చెబితే ఇక జనసేన ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


ప్రకాష్‌రాజ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘పవన్ కళ్యాణ్‌కు ఏమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. పవన్ నిర్ణయాలపై చాలా డిసప్పాయింట్ అయ్యాను. నువ్వొక లీడర్.. మీకొక పార్టీ ఉంది.. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి? ఏపీలో గాని, ఇంకో చోట గాని.. జనసేన ఓట్ షేర్ ఎంత.. బీజేపీ ఓటు షేర్ ఏంటి? 2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం, ఇంద్రుడు, చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు, వాళ్లు ద్రోహులు అన్నారు! మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు అంటున్నారు. అంటే, ఇలా మూడు, నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవల్లి అయి ఉండాలి కదా. జాతి హితం కోసమే బీజేపీకి మద్దతు అంటే.. వీళ్లు మాట్లాడుతోంది ఏంటసలు. ఈ బీజేపీ వాళ్లు వెయ్యి జన్మలు ఎత్తాలి కేసీఆర్ అవ్వాలంటే. అభిమానులకు బీజేపీకి సపోర్ట్ చేద్దాం అంటున్నారు.. అంటే లీడర్ నేను కాదు.. ఆయన అని పవన్ అంటున్నట్లు! మీరు బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే.. ఇక, జనసేన ఎందుకు? ఇంకొకరి భుజాన ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు?

బీజేపీ, కాంగ్రెస్ సహా జాతీయ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి. తెలంగాణ ప్రజలరా.. తస్మాత్ జాగ్రత్త! గతంలో ఇలా వచ్చిన వారికి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఈసారి ఆయన బిజీగా ఉన్నారు. ఈసారి ప్రజలే జాగ్రత్తగా ఉండాలి. ప్రజలారా.. ఈసారి మీరే ఇలా వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపాలి. వీళ్లకే కాక, వీళ్ల వెంట వెళ్లిన మన వారికి కూడా బుద్ధి చెప్పాలి.’’ అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


" draggable="true">




" draggable="true">




వరద బాధితుల కోసం జగన్ కీలక ఆదేశాలు

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ విజయం ఖాయమన్న ఎమ్మెల్యే బాల్‌రాజ్

వేరే లెవల్ లో రౌడీ హీరో మూవీ.. సుకుమార్ సూపర్ స్కెచ్..!

షూటింగ్ లో ఆ పని చేస్తూ నితిన్ కి దొరికిపోయిన కీర్తీ సురేష్..??

గ్రేటర్ యుద్దం : "ఇవి ఎన్నికల లేక జాతర నా.." బి‌జే‌పి మీద పొన్నాల సెటైర్లు !!

జగన్ కు అచ్చెన్న లేఖ... ఎందుకంటే

9 రోజుల పాటు పస్తులు .. మంచినీళ్లు తాగి..సునీల్ కష్టాలు చూడండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>