PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi46f14ae4-cde2-4894-9672-37b874ca20a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi46f14ae4-cde2-4894-9672-37b874ca20a3-415x250-IndiaHerald.jpgన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఇటీవల కాలుష్యం ప్రభావం మరింత పెరగడంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతోంది. పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంటలను తగులబెట్టడం వల్ల ఆ పొగ మొత్తం ఢిల్లీని ఆవరించేసింది. దీంతో ఢిల్లీ నగరంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.delhi;diwali;delhi;apple;haryana - chandigarh;capital;job;letter;central government;european union;custard apple;punjabఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న వాయు కాలుష్యంఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న వాయు కాలుష్యంdelhi;diwali;delhi;apple;haryana - chandigarh;capital;job;letter;central government;european union;custard apple;punjabFri, 27 Nov 2020 14:08:30 GMTన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఇటీవల కాలుష్యం ప్రభావం మరింత పెరగడంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతోంది. పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంటలను తగులబెట్టడం వల్ల ఆ పొగ మొత్తం ఢిల్లీని ఆవరించేసింది. దీంతో ఢిల్లీ నగరంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.

దీనికి తోడు ఇటీవల దీపావళి నాడు ప్రజలు కాల్చిన బాణసంచా వల్ల కాలుష్యం పతాకస్థాయికి చేరిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కేంద్ర వాతావరణ శాఖ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం
గరిష్టంగా 400 పాయింట్లకు, అత్యల్పంగా 300 పాయింట్లకు చేరినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం తెలుస్తోంది.

గాలిలో కాలుష్యం స్థాయిని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలియజేస్తుంది. వాయు కాలుష్యం 201-300 మధ్య ఉంటే ‘పూర్’గా ఉన్నట్లు.. 301-400 మధ్య వాయు కాలుష్యం ఉంటే ‘వెరీ పూర్’ ఉన్నట్లు. ఢిల్లీలో వాయు కాలుష్యం ‘వెరీ పూర్’ గరిష్ట మార్క్‌ను చేరుకుంది. ఇది కూడా దాటితే ‘సివియర్’స్థాయికి చేరుకుంటుంది. ఒకవేళ ఢిల్లీలో కాలుష్యం ఈ మార్కును కూడా చేరుకుంటే అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

ఈ విషయాన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కచ్చితంగా చెబుతోంది. ఒకవేళ ఢిల్లీలో కాలుష్యం సివియర్ స్థాయికి చేరుకుంటే ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే ప్రభుత్వాలు సరైన చర్యలు
తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో అధికార యంత్రాంగం పనితీరుపై ఢిల్లీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


గ్రేటర్ యుద్ధం : టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే మైనంపల్లి..?

రెడీ అయిన కరోనా వ్యాక్సిన్..తొలి దశలో 30 కోట్ల మందికి..!!

గ్రేటర్ యుద్ధం : టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా మంత్రులు మల్లారెడ్డి, ఈటెల..?

గ్రేటర్ యుద్ధం : చింతల్ డివిజన్ లో ప్రచారం లో దూసుకుపోతున్న టీఆర్ఎస్..?

రోహిత్ శర్మ లేకపోతే ఏంటి.. అతను ఉన్నాడు..?

బుల్లిపిట్ట: గూగుల్ పే యూజర్లకు శుభవార్త.. అసలు విషయం చెప్పిన గూగుల్!

అఖిల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్..టాప్ 2 లో ఉండేది వారే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>