SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/karthika-masam-special265ed8d0-93ce-485a-bd73-a66b16f54629-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/karthika-masam-special265ed8d0-93ce-485a-bd73-a66b16f54629-415x250-IndiaHerald.jpgపూర్వం దేవుని కాలంలో దేవుళ్ళు మరియు రాక్షసులు అమరత్వం కోసం చేసే సాగర మథనంలో లక్ష్మి దేవికి చెల్లెలిగా తులసి వచ్చిందని చెబుతుంటారు. అప్పుడు సహోదరి అయినటువంటి తులసి కూడా విష్ణు మూర్తిని చూసి ఇష్ట పడింది. తనను పెళ్లి చేసుకోవాలని కళలు కూడా కన్నది, కానీ అప్పటికే లక్ష్మీదేవి తో వివాహం జరిగి ఉండడంతో, తన అక్కపై ఎంతో కోపాన్ని ప్రదర్శించిందని పురాణాల ద్వారా తెలిసింది. దీనితో తీవ్ర ఆవేశానికి గురయిన లక్ష్మి దేవి తులసి మీద కోపంతో ఆమెని శపించింది.karthika masam special;deva;krishna;lakshmi;prema;tara;thulasi;vishnu;kanna lakshminarayana;marriage;love;sri krishna;tulasi;hindus;indian gooseberry;madhanam;sara shrawan;panga;mahaశ్రీ లక్ష్మి దేవి...తులసిని ఎందుకు శపించింది...?శ్రీ లక్ష్మి దేవి...తులసిని ఎందుకు శపించింది...?karthika masam special;deva;krishna;lakshmi;prema;tara;thulasi;vishnu;kanna lakshminarayana;marriage;love;sri krishna;tulasi;hindus;indian gooseberry;madhanam;sara shrawan;panga;mahaFri, 27 Nov 2020 06:00:00 GMTతులసి చెట్టును వివాహమాడుతారని పురాణాలు వేదాలు చెబుతున్నాయి. ఈ అపూర్వమైన కార్యం ఉత్థాన ద్వాదశి రోజున జరుగుతుంది. కాబట్టి ఈరోజును తులసి మొక్కను అత్యంత చక్కగా అలంకరిస్తారు. సాధారణంగా ఉసిరి మొక్కను హిందువులంతా శ్రీ మహా విష్ణువుగా పూజిస్తారు. కాబట్టి సాక్ష్యాత్తు విష్ణువు రూపంగా పూజించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసి చెట్టుతో వివాహాన్ని జరిపిస్తారు. మరి కొందరైతే వివాహానికి గుర్తుగా కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్క వద్ద ఉసిరి మొక్కలను నాటుతారు. ఇదంతా కూడా మనకు ఆ పురాణాల ద్వారా చెప్పడం జరిగింది. ఈ విధానాన్ని దేవాలయాల్లో కథలు కథలుగా చెబుతూ ఉంటారు.

పూర్వం దేవుని కాలంలో దేవుళ్ళు మరియు రాక్షసులు అమరత్వం కోసం చేసే సాగర మథనంలో లక్ష్మి దేవికి చెల్లెలిగా తులసి వచ్చిందని చెబుతుంటారు. అప్పుడు సహోదరి అయినటువంటి తులసి కూడా విష్ణు మూర్తిని చూసి ఇష్ట పడింది. తనను పెళ్లి చేసుకోవాలని కళలు కూడా కన్నది, కానీ అప్పటికే లక్ష్మీదేవి తో వివాహం జరిగి ఉండడంతో, తన అక్కపై ఎంతో కోపాన్ని ప్రదర్శించిందని పురాణాల ద్వారా తెలిసింది. దీనితో తీవ్ర ఆవేశానికి గురయిన లక్ష్మి దేవి తులసి మీద కోపంతో ఆమెని శపించింది...ఆ శాపమే ఇప్పుడు తులసి చెట్టులా మారిపోయింది.

ఇదంతా గమనించిన మహా విష్ణువు తులసి పట్ల జాలిపడి, అయ్యో ఎంత పని జరిగింది అని ఆమెతో ఇలా అన్నాడు, "తులసి బాధపడకు నువ్వు కన్నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది భవిష్యత్తులో ఎలాగైనా నేను నీకు దగ్గర అవుతాను...నేను ఒక సాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరౌతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్ళలో దేవాలయాల్లో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. తద్వారా నీకు భక్తులంతా పవిత్రంగా ఇంట్లో పెట్టుకుని పూజిస్తారు. నీకు కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి రోజున నీకు నాకు వివాహం జరిపిస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు.

యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా |
యథాగ్రే సర్వ వేదశ్చ తులసీ త్వం నామం మధ్యం ||

అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి వనాన్ని భక్తిగా పూజిస్తాం. చూసారా తులసి వివాహం వెనుక ఎంత మహత్తరమైన కథ దాగి ఉందో...ఈ కథ విన్న తరువాత తులసి చెట్టు పై మీకు ప్రేమ పెరుగుతుంది.


గ్రేటర్ యుద్ధం: ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా జవాబివ్వాలి

గ్రేటర్ యుద్ధం: ఎన్ని కేసులు పెట్టినా ఆపలేరు.. టీఆర్ఎస్‌పై తేజస్వీ సూర్య ఫైర్!

కింగ్ నాగ్ చిత్రం ఓటీటీలో?.. థియేటర్లలో విడుదలకు ఆలోచిస్తున్న నిర్మాతలు!

చిరంజీవిని అలా చూడలేమంటున్న ఫ్యాన్స్...?

గ్రేటర్ యుద్ధం: కాంగ్రెస్‌కు భారీ దెబ్బ.. బీజేపీలోకి సీనియర్ లీడర్

గ్రేటర్ లో టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ తగిలిందా..?

గ్రేటర్ యుద్ధం:పాపం టీడీపీ... వాళ్ళు కూడా వదిలేశారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>