PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dk aruna jumps into bjp-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dk aruna jumps into bjp-415x250-IndiaHerald.jpgబోరబండ డివిజన్ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. బోరబండ డివిజన్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా ప్రచారం చేసారు. ఈ సందర్భంగా పలువురు తెరాస కార్యకర్తలు పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక ఆమె మాట్లాడుతూ... డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో టీఆర్ఎస్ మోసం చేసింది అన్నారు. 1000 ఇళ్లు కూడా కట్టలేదు అని ఆమె విమర్శించారు. 12 వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తా అని అబద్ధాలు చెప్పారు అని మండిపడ్డారు. హైదరాబాద్ లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారు అయిgreater;modi;kcr;ktr;ramu;srinivas;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;narendra modi;baba bhaskar;chief minister;2020;narendraగ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణగ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణgreater;modi;kcr;ktr;ramu;srinivas;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;narendra modi;baba bhaskar;chief minister;2020;narendraFri, 27 Nov 2020 21:05:00 GMTశ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా ప్రచారం చేసారు. ఈ సందర్భంగా పలువురు తెరాస కార్యకర్తలు పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక ఆమె మాట్లాడుతూ... డబల్ బెడ్ రూమ్ ఇళ్ల  పేరుతో టీఆర్ఎస్ మోసం చేసింది అన్నారు. 1000 ఇళ్లు కూడా కట్టలేదు అని ఆమె విమర్శించారు. 12 వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తా అని అబద్ధాలు చెప్పారు అని మండిపడ్డారు. హైదరాబాద్ లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారు అయింది అని విమర్శించారు.

హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చారు అని మండిపడ్డారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బోరబండను ఎందుకు అభివృద్ధి చెయ్యలేదు? అని ప్రశ్నించారు. మళ్ళీ ఓట్లు అడగడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. బీజీపీ కార్యకర్తలను బెదిరించడం.. బయపెట్టడం సరికాదు అన్నారు. దుబ్బాక ఓటర్లు టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడకుండా.. బీజీపీ ని గెలిపించారు అని, బోరబండ వాసులు దుబ్బాక తీర్పును స్ఫూర్తి గా తీసుకోవాలి అని ఆమె సూచించారు. ఈ కొత్త రజాకార్ల కు ప్రజలు భయపడాలా? అని ఆమె ప్రశ్నించారు.

టీఆర్ఎస్ మేనిఫెస్టో పాత చింతకాయ పచ్చడిలా ఉంది అని, 2016 మ్యానిఫెస్టోలో  చెప్పిందే మళ్లీ 2020  మ్యానిఫెస్టోలో చేర్చారు అని ఆమె విమర్శించారు. కేసీఆర్ అహంకారం దిగేలా ప్రజలు తీర్పునివ్వాలి అని, వరదల్లో బీజేపీ నాయకులు నగరమంతా పర్యటించారు అని అన్నారు. అధికారం నీకిస్తే ...జనాలను పరామర్శించడానికి నరేంద్ర మోడీ రావాలా? అని ప్రశ్నించారు. కేటీఆర్ ...కల్వకుంట్ల తుపాకీ రాముడు  అని ఆమె ఎద్దేవా చేసారు. వరదల కు విశ్వనగరం కాదు విషాద నగరమైంది అని, 10వేల వరద సహాయంతో టీ ఆర్ఎస్ కార్యకర్తలు జేబులు నింపుకున్నారు అని మండిపడ్డారు. అబద్ధాల కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి  అనర్హుడు అని విమర్శించారు. మా కార్యకర్తల జోలికి వస్తే కబడ్ధార్ అని హెచ్చరిస్తున్నా అన్నారు. హైదరాబాద్ పాత నగరంగా మారొద్దంటే బీజీపీ ని గెలిపించండి అని ఆమె సూచించారు.


అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!

కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>