PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mumbai8f1297f1-2bd4-4f5c-b7bc-b44bdeff6923-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mumbai8f1297f1-2bd4-4f5c-b7bc-b44bdeff6923-415x250-IndiaHerald.jpgముంబై: బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. ఆమె బాలీవుడ్‌‌లో ఎన్నో సినిమాల్లో నటించింద. అగ్ర హీరోలతోనూ నటిచింది. ఝాన్సీ లక్ష్మీబాయ్ వంటి అద్భుత చిత్రాల్లోనూ ప్రేక్షకులను మెప్పించింది. అలాంటి నటి తెలియని వాళ్లుంటారా..? చెప్పండి. అందులోనూ బాలీవుడ్‌కు పుట్టినిల్లయిన ముంబైలో ఆమె గురించి వినని వారుంటారా..? కానీ ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్‌కు మాత్రం కంగన ఎవరో తెలియదట.mumbai;auto;kangana ranaut;mumbai;bharatiya janata party;apple;bollywood;రాజీనామా;east;high court;media;court;letter;european union;custard appleకంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్mumbai;auto;kangana ranaut;mumbai;bharatiya janata party;apple;bollywood;రాజీనామా;east;high court;media;court;letter;european union;custard appleFri, 27 Nov 2020 20:52:00 GMTముంబై: బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. ఆమె బాలీవుడ్‌‌లో ఎన్నో సినిమాల్లో నటించింద. అగ్ర హీరోలతోనూ నటిచింది. ఝాన్సీ లక్ష్మీబాయ్ వంటి అద్భుత చిత్రాల్లోనూ ప్రేక్షకులను మెప్పించింది. అలాంటి నటి తెలియని వాళ్లుంటారా..? చెప్పండి. అందులోనూ బాలీవుడ్‌కు పుట్టినిల్లయిన ముంబైలో ఆమె గురించి వినని వారుంటారా..? కానీ ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్‌కు మాత్రం కంగన ఎవరో తెలియదట.

కంగన కార్యాలయం కూల్చివేతకు సంబంధించి మీడియా ప్రశ్నించగా ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు. కంగన ఎవరో తనకు తెలియదని, తానెప్పుడూ ఆమెను చూడలేదని పడ్నేకర్ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. కంగన భవనం కూల్చేయడంపై బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) దారుణంగా వ్యవహరించిందంటున్న ప్రతిపక్షాల విమర్శలను కూడా పెడ్నేకర్ ఖండించారు. కంగన ఎవరు..? ఆమె ఏం చేస్తుంది..? అనే విషయాలు తనకేం తెలియదని, అలాంటప్పుడు ఆమె కార్యాలయ కూల్చివేతలో కక్ష సాధించే అవకాశం ఎలా ఉంటుందంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు.

కట్టడంలో అవకతవకలు ఉండడం వల్లే చర్యలు తీసుకున్నామని, నిజానికి వ్యక్తిగతంగా ఆమెపై తనకేం తెలియదని కిషోరి పెడ్నేకర్ పేర్కొన్నారు. తన పనిలో ఎక్కువగా నిమఘ్నమవడం వల్ల ఆమె సినిమాలను కూడా తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. అందువల్ల తనపై చేస్తున్న కక్ష సాధింపు ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. 

ఇదిలా ఉంటే తన కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీపై కంగన కోర్టుకెక్కారు. హైకోర్టు కూడా కంగనకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు తన తీర్పుతో బీఎంసీకి పాఠం నేర్పిందని, అధికారానికి కొమ్ము కాస్తూ దుశ్చర్యలకు పాల్పడితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. మునిసిపల్ కమిషనర్ రాజీనామా చేయాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. 

అయితే హైకోర్టు తీర్పుపై కూడా పెడ్నేకర్ పెదవి విరిచారు. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోందని, ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు హైకోర్టునే తప్పుపడుతున్నారని చెప్పారు. అయితే తాను కంగన గురించి కానీ, హైకోర్టు తీర్పు గురిచి కానీ మాట్లాడదలచుకోలేదని, కానీ ఈ విషయాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై బీఎంసీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? అని మీడియా ప్రశ్నించగా.. పెడ్నేకర్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.



గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>