PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war0d6f18fe-4a2f-4204-8a18-bb0db4b73eae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war0d6f18fe-4a2f-4204-8a18-bb0db4b73eae-415x250-IndiaHerald.jpgఎన్నికలు వస్తూంటాయి పోతూంటాయి. కానీ పదవులు పుచ్చుకున్న వారికి అలా ఉండదు కదా. దానని నిలబెట్టుకోవాలంటే ఎన్నికల యుద్ధంలో గెలిచి నిలవాలి. తమ మొత్తం బలాన్ని అంతా కూడా పెట్టి మరీ గట్టి రిజల్ట్ రాబట్టాలి. లేకపోతే ఉన్న కుర్చీలకే ఎసరు వస్తుంది. ఇపుడు టీయారెస్ మంత్రులకు అదే బాధ పట్టుకుంది. గ్రేటర్ ఎన్నికలేంటి, మంత్రి పదవులకు ఎసరేంటి అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే రాజకీయమంటేనే అది. ఎక్కడో కొడితే ఎవరికో దెబ్బ‌ తగులుతుంది. greater-war;hyderabad;minister;war;mantra;katthiగ్రేటర్ యుద్ధం : వాళ్ళ పదవులకు ఎర్త్ పెడుతున్నారుగా ?గ్రేటర్ యుద్ధం : వాళ్ళ పదవులకు ఎర్త్ పెడుతున్నారుగా ?greater-war;hyderabad;minister;war;mantra;katthiFri, 27 Nov 2020 19:00:00 GMTమంత్రి పదవులకు ఎసరేంటి అని  ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే రాజకీయమంటేనే అది. ఎక్కడో కొడితే ఎవరికో దెబ్బ‌ తగులుతుంది.

ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి కచ్చితంగా వందకు వంద డివిజన్లను గెలుచుకుని తీరాలని టీయారెస్ అధినాయకత్వం ఆర్డర్ పాస్ చేసింది. ఏం చేస్తారో తెలియదు కానీ 150 డివిజన్లలో వంద టీయారెస్ పరం కావాల్సిందే  అని గులాబీ బాస్ పట్టుపడుతున్నారుట‌. దాంతో టీయారెస్ మంత్రులను తీసుకువచ్చి డివిజన్లకు ఇంచార్జిలను చేశారు. వారి కులాలు, ప్రాంతాలను చూసి మరీ ఆయా డివిజన్లలో  గెలుపు  బాధ్యతలు అప్పగించారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఎక్కడో మూల జిల్లాల్లో ఉన్న వారికి గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ల గోల ఏమి తెలుస్తుంది. వారు ఈ వారం పదిరోజుల్లో ఏం చేయగలరు అన్నది పెద్ద టాస్క్.  కానీ అధినాయక‌త్వానికి ఇవేమీ పట్టింపు లేదు. మీరు అక్కడ ఏం చేస్తారో ఏమో తెలియదు మనకు గెలుపు దక్కాల్సిందే అంటూ హై కమాండ్ హుకుం జారీ చేసింది.

అంతే కాదుట మంత్రులు ప్రతీ రోజూ అక్కడ ఏం చేస్తున్నారో వారి మీద ఇంటిలిజెన్స్ నిఘా కూడా పెట్టారట. దాంతో అసలు అభ్యర్ధుల కంటే కూడా కొసరు మంత్రులు తెగ పరేషాన్ అవుతున్నారుట. గ్రేటర్ ఎన్నికలు కాదు కానీ మా కుర్చీ కిందకు నీళ్ళు వచ్చి చేరుతున్నాయని గోల పెడుతున్నారుట. గ్రేటర్ ఎన్నికల్లో టీయారెస్ అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోయినా, వందకు వందా సీట్లు దక్కకపోయినా అక్కడ ఇంచార్జిలుగా ఉన్న మంత్రుల మెడ మీద కత్తి వేలాడడం ఖాయమని అంటున్నారు. మొత్తం మీద మంత్రుల టెన్షన్ మామూలుగా లేదుట.






గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!

కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>