PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/congressd9bc3900-3faf-4103-80e5-b547b6a2197a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/congressd9bc3900-3faf-4103-80e5-b547b6a2197a-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరికొస్తున్న కొద్దీ హైదరాబాద్ లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇప్పటికే ప్రచారాల జోరు హోరెత్తిస్తుంది. అధికార,ప్రతిపక్ష పార్టీ లు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి గెలుపు ధీమా ను వ్యక్తం చేస్తుంది.. గ్రేటర్ ఎన్నికల ఇన్ ఛార్జి కేటీఆర్ 100 స్థానాలపై కన్నేసి అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ప్రతిపక్షాలు సైతం ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు తమ అస్త్రాలను ఉపయోగిస్తుంది. congress;ktr;kumaar;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;telangana;congress;reddy;partyటీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కు ఇది అగ్నిపరీక్షే..?టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కు ఇది అగ్నిపరీక్షే..?congress;ktr;kumaar;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;telangana;congress;reddy;partyFri, 27 Nov 2020 20:00:00 GMTహైదరాబాద్ లో  రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇప్పటికే ప్రచారాల జోరు హోరెత్తిస్తుంది. అధికార,ప్రతిపక్ష పార్టీ లు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి గెలుపు ధీమా ను వ్యక్తం చేస్తుంది.. గ్రేటర్ ఎన్నికల ఇన్ ఛార్జి  కేటీఆర్ 100 స్థానాలపై కన్నేసి అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ప్రతిపక్షాలు సైతం ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు తమ అస్త్రాలను ఉపయోగిస్తుంది.

దుబ్బాక విజయోత్సాహంతో తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.  ఇక తెలంగాణ లో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజు ఎంత దిగజారిపోతుందో అందరికి తెలిసిందే.. దుబ్బాక లో బీజేపీ ఇచ్చినంత పోటీ కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. దానికి కారణం సరైన నాయకత్వం లేకపోవడమే అని తెలుస్తుంది.ఈ ఎన్నికలకు ముఖ్య నేతలు రాకపోవడం ఈ పార్టీ కి కొంత నష్టం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి..  దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్రమైన నైరశ్యం ఏర్పడింది. పలు చోట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మలు కూడా తగులబెట్టారు. దుబ్బాకలో గౌరవనీయమైన ఓటమి కూడా కాకపోవడంతో.. ఇప్పుడైనా సరైన నేత చేతుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పెట్టకపోతే ఇక పార్టీ గురించి మర్చిపోవచ్చని నిష్టూరాలు వినిపించాయి.

అయితే ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డ్ పదవి పోవడం ఖాయంగా కనిపిస్తుంది.అయన పీసీసీ పగ్గాలు చేపట్టాక దాదాపు అన్ని రకాల ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఫలితాల విషయానికొస్తే పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పీసీసీ బాధ్యతల నుండి తప్పుకునేందుకు కెప్టెన్ ఉత్తమ్ గత కొద్ది నెలల క్రితం సంసిద్ధమైనప్పటికీ హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు కొత్త అధ్యక్షుడిని నియమించకపోవడంతో ఆయనే కొనసాగుతున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో 150 వార్డులకు గాను కాంగ్రెస్ కు దక్కిన సీట్లు కేవలం రెండు. టీఆర్ఎస్ కు 99, మజ్లిస్ పార్టీకి 44, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని లక్ష్యంగా పావులు కదుపుతోంది. మరి ఈ విధంగా ఉంటె కాంగ్రెస్ అధికారంలో ఉండడం చాలా కష్టమే.


గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!

కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>