PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/greater-war4210eed9-0047-4419-8253-5edb86f3c5a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/greater-war4210eed9-0047-4419-8253-5edb86f3c5a9-415x250-IndiaHerald.jpgతెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేడి రాజుకుంది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో అన్నీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంది...ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారనే విషయం అంతు చిక్కడం లేదు. గ్రేటర్ బరిలో అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఎం‌ఐ‌ఎం, టీడీపీ, కమ్యూనిస్టులు ఇతర చిన్నాచితక పార్టీలు పోటీ చేస్తున్నాయి. greater-war;bharatiya janata party;telangana rashtra samithi trs;janasena;congress;king;tdp;janasena party;partyగ్రేటర్ యుద్ధం: ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు?గ్రేటర్ యుద్ధం: ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు?greater-war;bharatiya janata party;telangana rashtra samithi trs;janasena;congress;king;tdp;janasena party;partyThu, 26 Nov 2020 00:00:00 GMTబీజేపీ, కాంగ్రెస్, ఎం‌ఐ‌ఎం, టీడీపీ, కమ్యూనిస్టులు ఇతర చిన్నాచితక పార్టీలు పోటీ చేస్తున్నాయి.

ప్రతి పార్టీ గట్టిగానే ప్రచారం చేస్తుంది. 150 డివిజన్లలోనూ టీఆర్ఎస్ పోటీ చేస్తుంటే, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 100 స్థానాలకు పైనే పోటీ చేస్తుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య ఉండేలా కనిపిస్తోంది. ఇక ఎం‌ఐ‌ఎం కొన్ని ప్రాంతాల్లో, టీడీపీ నాలుగైదు ప్రాంతాల్లో సత్తా చాటే అవకాశముంది. అయితే ఇందులో కొన్ని పార్టీలు రహస్య ఒప్పందం చేసుకుని ముందుకెళుతున్నాయని ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

అసలు బీజేపీకి జనసేన బహిరంగంగానే మద్ధతు ప్రకటించిన విషయం తెలిసిందే. అటు టీఆర్ఎస్-ఎం‌ఐ‌ఎంల మధ్య రహస్య ఒప్పందం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, ఇందులో ఎం‌ఐ‌ఎం కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. అటు టీఆర్ఎస్‌తో కొందరు కాంగ్రెస్ నేతలు అంటకాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలా ప్రతి పార్టీ వేరే వాళ్ళతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంటున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఇక ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నా అధికార టీఆర్ఎస్‌కే మెజారిటీ డివిజన్లు దక్కే అవకాశముందని తెలుస్తోంది. అటు పాతబస్తీలో ఎం‌ఐ‌ఎం ఎక్కువ డివిజన్లే గెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు ఎక్కువ గెలుస్తారనేది అంచనా రావడం లేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీకి మంచిగానే సీట్లు వస్తాయని అంటున్నారు. అటు టీడీపీ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ పార్టీ ఇతర పార్టీల విజయావకాశాలు దెబ్బతీసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి చూడాలి గ్రేటర్ వార్‌లో ఎవరిది పైచేయి అవుతుందో.




వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ

గ్రేటర్ యుద్ధం: అక్బరుద్దీన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>