PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-mim-mla-comments-plus-to-bjpd8e4070d-b769-4d49-ad8f-d9db75638ea4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-mim-mla-comments-plus-to-bjpd8e4070d-b769-4d49-ad8f-d9db75638ea4-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ-ఎం‌ఐ‌ఎం పార్టీలు తీవ్ర మాటల యుద్ధానికి దిగాయి. బీజేపీ పూర్తిగా హిందుత్వ పార్టీగా ఉంటే, ఎం‌ఐ‌ఎం ముస్లిం పార్టీగా ముద్రవేసుకుంది. దీంతో ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అసలు ఎన్నికల ప్రచారం మొదలవ్వడమే ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. బీజేపీ గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బీజేపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేశారు. greater-war;ntr;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;media;mla;war;nandamuri taraka rama rao;hindusగ్రేటర్ యుద్ధంలో పీవీ-ఎన్టీఆర్‌లు...బీజేపీకి ప్లస్ అవుతుందా?గ్రేటర్ యుద్ధంలో పీవీ-ఎన్టీఆర్‌లు...బీజేపీకి ప్లస్ అవుతుందా?greater-war;ntr;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;media;mla;war;nandamuri taraka rama rao;hindusThu, 26 Nov 2020 02:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ-ఎం‌ఐ‌ఎం పార్టీలు తీవ్ర మాటల యుద్ధానికి దిగాయి. బీజేపీ పూర్తిగా హిందుత్వ పార్టీగా ఉంటే, ఎం‌ఐ‌ఎం ముస్లిం పార్టీగా ముద్రవేసుకుంది. దీంతో ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అసలు ఎన్నికల ప్రచారం మొదలవ్వడమే ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. బీజేపీ గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బీజేపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

అటు ఎం‌ఐ‌ఎం కూడా బీజేపీకి ధీటుగా మాట్లాడుతోంది. అయితే వీరి మాటల యుద్ధంలోకి దివంగత నేతలు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌లు వచ్చారు. 4,700 ఎకరాలున్న హుస్సేన్‌సాగర్ ఇవాళ 700 ఎకరాలు కూడా లేదని, అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారని.. అలా అయితే హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.

ఇక అక్బరుద్దీన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే కౌంటర్ ఇచ్చేశారు. హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా? నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా భాయ్ అంటూ ఫైర్ అయిన బండి సంజయ్... పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండుగంటల్లో నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే పీవీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, ఎన్టీఆర్ టీడీపీకి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే.

వీరిని పార్టీలకు అతీతంగా అభిమానించే వారు ఉన్నారు. ఇక వీరి సమాధులపై ఎం‌ఐ‌ఎం ఎమ్మెల్యే కామెంట్ చేయగానే బీజేపీ స్పందించడం గమనార్హం. ఎం‌ఐ‌ఎంకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే బండి సంజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. ఇలా పీవీ, ఎన్టీఆర్ సమాధుల విషయంలో అధికార టీఆర్ఎస్ కూడా స్పందించింది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలని ఖండిస్తున్నట్లు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఇక విషయంలో బీజేపీ స్పందించడం వల్ల ఆ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.




వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ

గ్రేటర్ యుద్ధం: అక్బరుద్దీన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>