MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakuk0848a064-0612-4451-accc-6eb109cd1373-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakuk0848a064-0612-4451-accc-6eb109cd1373-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేకులు పడిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఇటీవల ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపుల కారణంగా షూటింగ్‌లన్నీ మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ, స్టార్‌లందరూ షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. షూటింగ్ సమయంలో సిబ్బంది శానిటైజ్ చేస్తూ, భౌతిక దూరం పాటిస్తున్నారు. షూటింగ్‌లలో పాల్గొంటున్న స్టార్‌ హీరోయిన్‌ల లిస్ట్‌లో అందరికంటే ముందు రకుల్ ప్రీతి సింగ్ ఉంది. rakuk;hari;hari music;krish;prithy;rakul preet singh;india;cinema;tamil;hero;heroine;central governmentఆ ప్రచారాన్ని నమ్మకండి.. ఆ సినిమాలో రకుల్ ప్రీత్ నటించడం లేదు!ఆ ప్రచారాన్ని నమ్మకండి.. ఆ సినిమాలో రకుల్ ప్రీత్ నటించడం లేదు!rakuk;hari;hari music;krish;prithy;rakul preet singh;india;cinema;tamil;hero;heroine;central governmentThu, 26 Nov 2020 11:09:23 GMTసినిమా షూటింగ్‌లకు బ్రేకులు పడిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఇటీవల ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపుల కారణంగా షూటింగ్‌లన్నీ మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ, స్టార్‌లందరూ షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. షూటింగ్ సమయంలో సిబ్బంది శానిటైజ్ చేస్తూ, భౌతిక దూరం పాటిస్తున్నారు. షూటింగ్‌లలో పాల్గొంటున్న స్టార్‌ హీరోయిన్‌ల లిస్ట్‌లో అందరికంటే ముందు రకుల్ ప్రీతి సింగ్ ఉంది.

ఇటీవలే ఆమె క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ఓ సినిమాను పూర్తి చేసింది. ఇది లాంగ్ షెడ్యూల్. 35రోజులపాటు ఈ షూటింగ్ కంటిన్యూగా జరిగింది. లాంగ్ షెడ్యూల్ వల్ల అలసిపోయిన రకుల్ తన కుటుంబ సభ్యులతో కలిసి సేదతీరడానికి మాల్దీవులకు వెళ్లింది. సోదరుడితో కలిసి అక్కడ బాగా ఎంజాయ్ చేసింది.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో రెండూ తెలుగు సినిమాలు, ఓ తమిళ సినిమా ఉంది. ఒకటి వైష్ణవ్‌తేజ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం. ఇందులో ఆమె పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్నారు. ఇంకొకటి నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘చెక్‌’ చిత్రం. ఈ సినిమాలో ఆమె లాయర్‌గా నటిస్తున్నారు. ఇక తమిళ సినిమా విషయానికొస్తే హీరో శివకార్తికేయన్‌తో ఓ సినిమా నటిస్తున్నారు. అంతేకాకుండా హిందీలో అర్జున్‌కపూర్‌, జాన్‌ అబ్రహం ‘ఎటాక్‌’ సహా అజయ్‌ దేవగణ్‌, అమితాబ్‌ బచ్చన్‌ ‘మే డే’ చిత్రాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

 ఇదిలా ఉండగా.. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో రకుల్‌ కూడా నటిస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి. దీంతో అందరూ ‘సన్ ఆఫ్ ఇండియా’లో రకుల్ నటించనున్నారని అనుకున్నారు. అభిమానులు అయితే, తమ అభిమాన హీరోయిన్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారని అనుకున్నారు. కానీ ఆమె మేనేజర్‌ హరి అదంతా అబద్ధమని కొట్టిపాడేశాడు. అందులో వాస్తవం లేదని, ‘సన్ ఆఫ్ ఇండియా’లో రకుల్ నటించడం లేదని స్పష్టం చేశారు.


కేసీఆర్ అలా చేస్తున్నాడంటే బీజేపీ గెలిచినట్లే మరీ..?

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. వారి కోసం ప్రత్యేక రైళ్లు..?

గ్రేటర్ యుద్ధం:రఘునందన్ దూకుడు ప్రచారం...!

వార్నర్ ఒక క్రికెటర్ మాత్రమే.. సెలెక్టర్ కాదు..?

గ్రేటర్ యుద్ధం: తెరాస అభ్యర్థులకు అడుగడుగునా కష్టాలు...!

అరుదైన రికార్డ్ సాధించిన ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్

గ్రేటర్ యుద్ధం:వాళ్లకు రేవంత్ రెడ్డి స్పెషల్ రిక్వస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>