MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-bossfb568948-172a-48bf-ac51-672f391a9485-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-bossfb568948-172a-48bf-ac51-672f391a9485-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో విజయవంతంగా దూసుకుపోతుంది. నాగార్జున రెండవసారి హోస్ట్ చేయగా ఈ షో ప్రారంభమయ్యి 81 రోజులు కావస్తుంది. ఇప్పటికే షో ఎన్నో ఎమోషన్స్ ని ప్రేక్షకులకు చూపించింది. 16 మంది తో మొదలయిన బిగ్ బాస్ షోలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. సొహైల్, అభిజిత్‌, హారిక, అరియనా, అవినాష్, అఖిల్, మోనాల్ షో లో మిగలగా మిగతా వారు ఒక్కొక్కరిగా ఇంటి మొఖం పట్టారు. ఇక ఈ వారం అరియనా, అవినాష్, మోనాల్, అఖిల్ నామినేషన్ లో నిలవగా, ఇప్పటికే అవినాష్ కి ఎవిక్షన్ పాస్ లభించింది.bigg boss;nagarjuna akkineni;abhijith;akhil akkineni;devineni avinash;telugu;bigboss;december;episode;army;letterబిగ్ బాస్ నుండి షాకింగ్ న్యూస్..నో ఎలిమినేషన్బిగ్ బాస్ నుండి షాకింగ్ న్యూస్..నో ఎలిమినేషన్bigg boss;nagarjuna akkineni;abhijith;akhil akkineni;devineni avinash;telugu;bigboss;december;episode;army;letterThu, 26 Nov 2020 15:47:07 GMTబిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో విజయవంతంగా దూసుకుపోతుంది. నాగార్జున రెండవసారి హోస్ట్ చేయగా ఈ షో ప్రారంభమయ్యి 81 రోజులు కావస్తుంది. ఇప్పటికే షో ఎన్నో ఎమోషన్స్ ని ప్రేక్షకులకు చూపించింది. 16 మంది తో మొదలయిన బిగ్ బాస్ షోలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. సొహైల్, అభిజిత్‌, హారిక, అరియనా, అవినాష్, అఖిల్, మోనాల్ షో లో మిగలగా మిగతా వారు ఒక్కొక్కరిగా ఇంటి మొఖం పట్టారు. ఇక ఈ వారం అరియనా, అవినాష్, మోనాల్, అఖిల్ నామినేషన్ లో నిలవగా, ఇప్పటికే అవినాష్ కి ఎవిక్షన్ పాస్ లభించింది. ఈ పాస్ ని రెండు వారాల్లోపు ఉపయోగించుకునే అవకాశం అవినాష్ కి ఉంటుంది. గత ఎపిసోడ్ లో మోనాల్ అఖిల్ అభిజిత్ ట్రైయాంగిల్ నాకు వద్దు అంటూ కంటతడి పెట్టుకోవడం అభి ఆర్మీ ని, బిగ్ బాస్ ప్రేక్షకులను కలచివేసింది.



నో ఎలిమినేషన్ వీక్

ఇక అందుతున్న తాజా సమాచారం షో ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో ఈ వారం బిగ్ బాస్ 4 లో ఎలిమినేషన్ ఉండబోదు అని తెలుస్తుంది. ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుల నుండి ఒకరిని రీఎంట్రీ చేయబోతున్నారని వార్తలు వచ్చిన, పాండెమిక్ పరిస్థితుల మధ్య అలాంటి రిస్క్ చేయకపోవడమే మంచిదని రీఎంట్రీ ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తుంది.

గ్రాండ్ ఫినాలే అప్పుడే


ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 20 వ తేదీన నిర్వహించబోతున్నట్టు తాజాగా సమాచారం అందుతున్న నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే గెస్ట్ ల లిస్ట్ బయటకు రావాల్సి ఉంది. ఇక టాప్ 5 లో అభిజిత్, అఖిల్, సోహెల్, హారిక, అవినాష్ లు ఉంటారు అంటూ అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. ఎప్పటికపుడు ఈక్వేషన్స్ మారుతున్న క్రమంలో మరి టాప్ 5 లో ఎవరు ఉంటారు అనేది తెలుసుకోవాలంటే డిసెంబర్ 20 వరకు వేచి చూడాల్సిందే.




పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుండె బద్దలయ్యే వార్త ....??

నివర్ తుఫాన్ - ఏపీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై సీఎం ప్రత్యేక దృష్టి!

గ్రేటర్ యుద్దం : బి‌జే‌పి మ్యానిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సి‌ఎం..!!

గ్రేటర్ యుద్ధం:తెరాసలోకి వైసీపీ నేతలు...?

గ్రేటర్ యుద్ధం:బండి సంజయ్ కి పోలీసుల షాక్...?

‘జల్లికట్టు’కు కంగన అభినందన.. బాలీవుడ్‌పై ఫైర్

సమంత దినచర్య ఏంటో తెలిస్తే షాక్..అదే ఆమె గ్లామర్ సీక్రెట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>