PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-cm-jagan-class-to-two-ysrcp-leaders-92044bd7-7cb2-42e6-8262-13c7804e554c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-cm-jagan-class-to-two-ysrcp-leaders-92044bd7-7cb2-42e6-8262-13c7804e554c-415x250-IndiaHerald.jpgఈ మధ్య అధికార వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోయిన విషయం తెలిసిందే. సొంత పార్టీలోని నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కాకినాడ డీఆర్సీ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఎంపీ పిల్లి ఆరోపించగా.. ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఎవరు అవినీతి చేశారో వారి పేర్లు తనకు ఇవ్వాలని ద్వారంపూడి ఎంపీని కోరారు. jagan;chandra bose;chandrabose;jagan;pilli subhash chandra bose;rajya sabha;mp;chief minister;mla;cheque;subhas chandra bose;thota chandrasekhar;ycp;kakinadaఆ ఇద్దరిలో జగన్ ఎవరికి చెక్ పెడతారో?ఆ ఇద్దరిలో జగన్ ఎవరికి చెక్ పెడతారో?jagan;chandra bose;chandrabose;jagan;pilli subhash chandra bose;rajya sabha;mp;chief minister;mla;cheque;subhas chandra bose;thota chandrasekhar;ycp;kakinadaThu, 26 Nov 2020 04:00:00 GMTకాకినాడ డీఆర్సీ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఎంపీ పిల్లి ఆరోపించగా.. ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఎవరు అవినీతి చేశారో వారి పేర్లు తనకు ఇవ్వాలని ద్వారంపూడి ఎంపీని కోరారు.

అలాగే మెడలైన్ వంతెన నిర్మాణం విషయంలోనూ పిల్లి అభ్యంతరం తెలిపారు. దీని వల్ల కాకినాడ సిటీలో పలు ప్రాంతాలు ముంపుకు గురవుతాయని, కాబట్టి దీన్ని ఆపేయాలని పిల్లి మాట్లాడారు. ఇక దీనిపై ఎమ్మెల్యే, పిల్లికి వ్యతిరేకంగా స్పందించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఇలా ఇద్దరు నేతలు గొడవ పడటంతో, వీరిని సీఎం జగన్ తన వద్దకు పిలిచారు.

నేతల వ్యవహార శైలిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. దీంతో తనను కలవాలని ఇరువురు నేతలను ముఖ్యమంత్రి పిలిపించారు. ఈ క్రమంలోనే ఇరువురి నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. దీనిపై ఇద్దరికీ సీఎం క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ ద్వారంపూడి బాగా హైలైట్ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఆయనే గట్టిగా అరిచారు. దీంతో జగన్ ఈ వివాదాన్ని సద్దుమనిగేలా చేయడానికి, నేతలనీ పిలిచి క్లాస్ తీసుకున్నారు.

అయితే అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే నడుస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ నేతలకు ఒకరు అంటే ఒకరికి పడటం లేదు. దీని వల్ల వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పి వచ్చి పడుతుంది. దీని వల్ల పార్టీకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే జగన్ ఎప్పటికప్పుడు నేతలని పిలిచి సర్ది చెబుతున్నారు.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ టీడీపీకి ఛాన్స్ లేకుండా చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే...

వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>