PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus290c6127-b828-4374-b3db-d6839ef6ce0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus290c6127-b828-4374-b3db-d6839ef6ce0c-415x250-IndiaHerald.jpgన్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు పెరుగుతుండడం ఆనందం కలిగిస్తున్నా.. తాజా కేసుల సంఖ్య అంతకు రెట్టింపు సంఖ్యలో పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. మాస్క్‌లు ధరించడం, చేతులు శానిటైజ్చేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటి కనీస చర్యలు ప్రజలంతా ఎట్టిపరిస్థితుల్లో పాటించేలా చూడాలని నిర్ణయించుకుcoronavirus;delhi;apple;narendra modi;arvind kejriwal;capital;prime minister;letter;local language;central government;european union;custard appleమాస్క్ మర్చిపోయారా.. కట్టండి రూ.5వేలు!మాస్క్ మర్చిపోయారా.. కట్టండి రూ.5వేలు!coronavirus;delhi;apple;narendra modi;arvind kejriwal;capital;prime minister;letter;local language;central government;european union;custard appleThu, 26 Nov 2020 15:17:31 GMTన్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు పెరుగుతుండడం ఆనందం కలిగిస్తున్నా.. తాజా కేసుల సంఖ్య అంతకు రెట్టింపు సంఖ్యలో పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. మాస్క్‌లు ధరించడం, చేతులు శానిటైజ్చేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటి కనీస చర్యలు ప్రజలంతా ఎట్టిపరిస్థితుల్లో పాటించేలా చూడాలని నిర్ణయించుకున్నాయి.

రెండు రోజుల క్రితం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలోనూ ఈ విషయంపైనే ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలు కచ్చితంగా జగ్రత్తలు తీసుకునేలా చూడాలని స్థానిక అధికారులకు ఆల్టిమేటం జారిచేసింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కేసులు పెట్టడంతో పాటు భారీగా
జరిమానా కూడా వసూలు చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే ఢిల్లీలో మాస్క్ ధరించకుండా బయటకు వస్తే రూ.2000 జరిమానా విధించనున్నట్లు కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. ఇప్పుడు
హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ జరిమానాను భారీగా పెంచేశారు. అక్కడి కులూ జిల్లాలో మాస్క్ ధరించకుండా ఎవరైనా బయటకు వస్తే రూ. 5 వేలు జరిమానా విధించాలని అధికారులు నిర్ణయించారట. హర్యానాలోని గురుగ్రామ్‌లో మాస్క్ ధరించనివారికి
రూ. 2,500 జరిమానా విధిస్తున్నట్లు అధికారిక లక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం రూ. 500 జరిమానా విధిస్తున్నారు.

గుజరాత్‌లో మాస్క్ ధరించని వారి నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. పంజాబ్‌లో మాస్క్ ధరించనివారికి ఇంతవరకూ రూ.200 జరిమానా విధిస్తుండగా, దానిని రూ. 500కు పెంచారు. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో మాస్కు ధరించకుండా బయటకు వచ్చేవారికి రూ. 500 ఫైన్ వేస్తున్నారు. మహారాష్ట్రలో ఒక్కో చోట ఒక్కోవిధంగా ఫైన్ నడుస్తోంది. పూణేలో బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేస్తే రూ.1000 ఫైన్‌ను అధికారులు వసూలు చేస్తున్నారు. 


గ్రేటర్ యుద్దం: భారతి నగర్ లో గెలుపు కాంగ్రెస్ దేనా?

ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం.. గంగూలీ కీలక వ్యాఖ్యలు..?

టీడీపీకి జేసి ఫ్యామిలీ గుడ్ బై

నివర్ తుఫాన్ - పలు రైళ్ళను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే

గ్రేటర్ యుద్ధం : శేరిలింగంపల్లి 110 వ డివిజన్ లో టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారం..?

గ్రేటర్ యద్ధం: పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం

గ్రేటర్ యుద్ధం : బస్తీలలో టీఆర్ఎస్ నేతల విస్తృత ప్రచారం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>