MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/unexpected-problems-to-adi-purushabee5e26-8c54-4028-9e2f-29a666ead7a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/unexpected-problems-to-adi-purushabee5e26-8c54-4028-9e2f-29a666ead7a0-415x250-IndiaHerald.jpgఒక్కప్పుడు రామానంద్ సాగర్ బుల్లితెర పై రామాయణం చూపెడితే దేశం యావత్తు విపరీతంగా ఆ సీరియల్ ను చూడటమే కాకుండా భక్తి భావంతో ఊగిపోయారు. ఈమధ్య లాక్ డౌన్ సమయంలో మళ్ళీ అదే సీరియల్ ను దూరదర్శన్ ప్రసారం చేస్తే ఊహించని హైయస్ట్ రేటింగ్స్ వచ్చాయి.అయితే ఇప్పుడు ఆ రాముడి పై సినిమా తీయాలనుకుంటే తమ మనోభావాలు దెబ్బ తినకుండా మూవీలను తీయాలని లేకుంటే సమస్యలు వస్తాయని కొన్ని హిందూ మత సంస్థలు అప్పుడే హెచ్చరికలు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లంక కు త్రేprabhas;prabhas;akshay kumar;kumaar;abhishek;adhithya;akshay;raj;ramu;rajasthan;adinarayanareddy;cinema;fireఆది పురుష్ కు ఊహించని సమస్యలు ?ఆది పురుష్ కు ఊహించని సమస్యలు ?prabhas;prabhas;akshay kumar;kumaar;abhishek;adhithya;akshay;raj;ramu;rajasthan;adinarayanareddy;cinema;fireWed, 25 Nov 2020 08:00:00 GMT

అయితే ఇప్పుడు ఆ రాముడి పై సినిమా తీయాలనుకుంటే తమ  మనోభావాలు దెబ్బ తినకుండా మూవీలను తీయాలని లేకుంటే సమస్యలు వస్తాయని కొన్ని హిందూ మత సంస్థలు అప్పుడే హెచ్చరికలు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లంక కు త్రేతాయుగానికి లింక్ చేస్తూ రామాయణ కథను రామసేతు పేరుతో అభిషేక్ శర్మ దర్శకత్వంలో ఈసినిమాను తీస్తున్నారు.  



ఇందులో అక్షయ్ కుమార్ కథానాయకుడి గా నటిస్తున్నాడు. ఇక ‘ఓం’ పేరుతో ఆదిత్య కపూర్ హీరోగా మరో సినిమా కూడ రాబోతోంది. ఈమూవీ టైటిల్లోనే మత వివాదం దాగి ఉందని కొందరి వాదన. వాస్తవానికి మతాన్ని సినిమాన్ని టచ్ చేస్తూ వివాదాలు రావడం కొత్తకాదు. గతంలో మణిరత్నం ‘ముంబాయి’ సినిమా తీసినప్పుడు కొందరు ఆవేశపర్లు మణిరత్నం ఇంటిని తగులబెట్టే ప్రయత్నం చేయడం అప్పట్లో సంచలనం.


ఆమధ్య సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ మూవీని తీసినప్పుడు రాజస్థాన్ లోని రాజ్ పుత్ లు తమ రాణీని కించపరిచే విధంగా ఈమూవీ ఉందని సమస్యలు సృష్టించారు. అంతేకాదు సంజయ్ లీలా భన్సాలీ పై దాడి చేయడమే కాకుండా ఏకంగా ఆ మూవీ సెట్ కు నిప్పుపెట్టి సంచలనంగా మారారు. ఇప్పుడు లేటెస్ట్ ప్రభాస్ ను రాముడు గా చూపెడుతూ దర్శకుడు ఓమ్ రౌత్ తీయబోతున్న ‘ఆదిపురుష్’ మూవీ కథను ముందుగా తమకు చూపెట్టి తమ అనుమతులు తీసుకోవాలని కొన్ని మత సంస్థలు ఇప్పటికే ఈమూవీ నిర్మాతలతో రాయబారాలు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ‘ఆది పురుష్’ మూవీ కథలో ఏమాత్రం తేడా కనిపించినా కొందరు ఈ సున్నిత విషయాన్ని చాల సీరియస్ తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు..




కాంగ్రెస్ మీద ఆధారపడుతున్న బిజెపి...?

హెరాల్డ్ సెటైర్ : ఏకంగా సీటుకే ఎసరుపెట్టేట్టున్నాడే

RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>