MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balae7d925e9-bacc-4019-8728-e345979e31da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balae7d925e9-bacc-4019-8728-e345979e31da-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికి నాలుగు సీజన్లు జరిగితే రెండు సార్లు హోస్టింగ్ చేసిన ఘనత హీరో నాగార్జున చేజిక్కించుకున్నారు. నాగార్జున తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ అటు ఆడియన్స్ ని ఇటు బిగ్ బాస్ హౌజ్ కంటెస్టెంట్స్ ని కూడా అలరిస్తున్నారు. వీకెండ్స్ లో షో రేటింగ్ అమాంతం పెరిగిపోతోంది అంటే దానికి నాగార్జున హోస్టింగ్ ప్రధాన కారణం అని చెప్పుకోవాల్సిందే.bala;chiranjeevi;ntr;nani;balakrishna;nagarjuna akkineni;bhavana;jr ntr;rahul new;rahul;tara;k l rahul;telugu;bigboss;audience;interview;winner;hero;rahul sipligunj;success;fidaaబిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య ?బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య ?bala;chiranjeevi;ntr;nani;balakrishna;nagarjuna akkineni;bhavana;jr ntr;rahul new;rahul;tara;k l rahul;telugu;bigboss;audience;interview;winner;hero;rahul sipligunj;success;fidaaWed, 25 Nov 2020 20:30:00 GMTబిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికి నాలుగు సీజన్లు జరిగితే రెండు సార్లు హోస్టింగ్ చేసిన ఘనత హీరో నాగార్జున చేజిక్కించుకున్నారు. నాగార్జున తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ అటు ఆడియన్స్ ని ఇటు బిగ్ బాస్ హౌజ్ కంటెస్టెంట్స్ ని కూడా అలరిస్తున్నారు. వీకెండ్స్ లో షో రేటింగ్ అమాంతం పెరిగిపోతోంది అంటే దానికి నాగార్జున హోస్టింగ్ ప్రధాన కారణం అని చెప్పుకోవాల్సిందే.

నిజానికి రియాల్టీ షోస్ లో హోస్టింగ్ చేయడం అన్నది చాలా కష్టమైన విషయం. స్పాంటేనియస్ గా మాట్లాడాలి. అన్ని రకాలుగా అందరికీ ఆకట్టుకోవాలి. డ్రెస్ కోడ్ నుంచి బాడీ లాంగ్వేజ్ నుంచి లుక్ నుంచి అన్నీ పెర్ఫెక్ట్ గా ఉంటేనే పక్కాగా రిజల్ట్ వస్తుంది. ఇదిలా ఉంటే గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కి కూడా నాగార్జున హోస్టింగ్ చేసి మంచి మార్కులు కొట్టేశారు.

ఈ షోకి ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి కూడా హోస్ట్ చేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ వన్ కి జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ చేసి సూపర్ అనిపించుకున్నారు. సీజన్ టూ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేసి తాను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. రానున్న సీజన్లలో ఎవరు హోస్ట్ చేస్తారు అన్నది కూడా ఇపుడు ఒక చర్చ.

ఇప్పటికే రెండు సార్లు హోస్ట్ చేసిన నాగార్జున మళ్ళీ ఓకే చెప్పకపోవచ్చు అంటున్నారు. మరి చిరంజీవి నాగార్జున తరువాత టాప్ హీరోగా ఉన్న బాలయ్య బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి  హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా ఆయన అభిమానుల్లో ఉంది. దీని మీద బిగ్ బాస్ సీజన్ త్రీ విజేత రాహుల్ సింప్లిగంజ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ కి ఫ్యూచర్ లో బాలక్రిష్ణ హోస్ట్ చేస్తే బాగుంటుంది అని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.

బాలయ్య మార్క్ భారీ డైలాగ్స్ కి ఎటూ ఆడియన్స్ ఫిదా అవుతారు. అదే సమయంలో ఆయన స్టేజ్ మీదకు వస్తేనే కంటెస్టెంట్స్ మొత్తం వణుకుతారని అంత డిసిప్లిన్ బాలయ్యదని రాహుల్ చెప్పుకొచ్చాడు. మరి రాహుల్ మనసులో ఉన్న ఈ భావన బాలయ్య దాకా చేరితే ఆయన హోస్టింగ్ కి సై అంటే ఆ కధే వేరుగా ఉంటుందేమో చూడాలి.






ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ

గ్రేటర్ యుద్ధం: అక్బరుద్దీన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్

గ్రేటర్ యుద్ధం: పీవీ, ఎన్టీయార్ సమాధులు కూల్చాలన్న అక్బరుద్దీన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>