MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabhas754f46af-6710-4ce0-8e10-4a1cf187ccac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabhas754f46af-6710-4ce0-8e10-4a1cf187ccac-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు ఎంచుకుంటూ వేగవంతంగా కొనసాగుతున్నారు. బాహుబలి రెండు సినిమాల తర్వాత భారతీయ సినిమా చరిత్రలో బడా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సాహో మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగారు. rebal star prabhas;baahubali;prabhas;bhagyashree;kumaar;pooja hegde;krishna;krishnam raju;naga;priyadarshi;vyjayanthi;india;apherald;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;saaho;love;heroine;success;yuva;butter;vemuri radhakrishna;love storyవామ్మో ప్రభాస్ .... ఏకంగా రూ.1500 కోట్లా .... ఏంటిది నిజమేనా ....??వామ్మో ప్రభాస్ .... ఏకంగా రూ.1500 కోట్లా .... ఏంటిది నిజమేనా ....??rebal star prabhas;baahubali;prabhas;bhagyashree;kumaar;pooja hegde;krishna;krishnam raju;naga;priyadarshi;vyjayanthi;india;apherald;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;saaho;love;heroine;success;yuva;butter;vemuri radhakrishna;love storyWed, 25 Nov 2020 22:30:25 GMTటాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు ఎంచుకుంటూ వేగవంతంగా కొనసాగుతున్నారు. బాహుబలి రెండు సినిమాల తర్వాత భారతీయ సినిమా చరిత్రలో బడా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సాహో మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగారు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రిట్రో లవ్ స్టోరీ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక దీని అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఒక సినిమాతో పాటు ఆదిపురుష్ అనే భారీ హిస్టారికల్ సినిమాలో కూడా ప్రభాస్ నటించనున్నారు.

ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి మొత్తంగా ప్రభాస్ నటించనున్న ఈ మూడు సినిమాల బడ్జెట్ లు కలిపి దాదాపు రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని, వీటిలో రాధేశ్యాం బడ్జెట్ రూ. 400 కోట్లు కాగా నాగ అశ్విన్ సినిమా బడ్జెట్ రూ. 500 కోట్ల పైచిలుకే ఉంటుందని అలానే ఓం రౌత్ తీయనున్న ఆదిపురుష్ కూడా రూ.600 కోట్ల వరకు బడ్జెట్ ఉండనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకరకంగా యావత్ భారత దేశ సినీ చరిత్రలోనే ఈ రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న నటుడు కేవలం ప్రభాస్ మాత్రమేనని ఆయన సినిమాల బడ్జెట్ అలానే లైనప్ చూస్తుంటే బాలీవుడ్ బడా హీరోలకు సైతం వెన్నులో వణుకు పుట్టక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాలతో ప్రభాస్ ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి....!!


ప్రముఖ టివి షో లో కన్నీళ్లు పెట్టించిన కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు ....!!

వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>