Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-electionsbb8dc21a-a4ba-4ed1-a3fe-cc14f36c369d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-electionsbb8dc21a-a4ba-4ed1-a3fe-cc14f36c369d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు ఎంతో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా పార్టీల పెద్దలు కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఆయా డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వాడి వేడి గా మారిపోయాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేదానిపై ప్రస్తుతం ఓటర్లకు చెబుతూ ఆయా అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేgreater-war;view;jyothi;revanth;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;mp;pond;mla;local language;march;reddy;partyగ్రేటర్ యుద్ధం : నాచారం డివిజన్ అభ్యర్థికి మద్దతుగా రేవంత్ ప్రచారం..?గ్రేటర్ యుద్ధం : నాచారం డివిజన్ అభ్యర్థికి మద్దతుగా రేవంత్ ప్రచారం..?greater-war;view;jyothi;revanth;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;mp;pond;mla;local language;march;reddy;partyWed, 25 Nov 2020 13:30:00 GMTతెలంగాణ రాజకీయాలు వాడి వేడి గా మారిపోయాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేదానిపై ప్రస్తుతం ఓటర్లకు చెబుతూ ఆయా అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.



 కాగా ఇటీవలే నాచారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మేడల జ్యోతి డివిజన్లోని పలు కాలనీలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా కాంగ్రెస్ కీలక నేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సీతక్క రోడ్ షో  నిర్వహించి ప్రసంగం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2015 జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ టిఆర్ఎస్ నెరవేర్చలేదు అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే కార్పోరేటర్ ఏకంగా ఇళ్లు నిర్మాణాన్ని అడ్డుకుని  కమిషన్లు అడిగే దుస్థితి నెలకొంది అంటూ విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి.


 వరదబాధితులకు ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు చొప్పున పరిహారం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే కెసిఆర్ పదివేలు ఇచ్చారని ఆ పదివేల రూపాయలు కూడా అర్హులకు రాలేదని టీఆర్ఎస్ నేతలు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. గ్రేటర్ పరిధిలో ఇలాంటి పాలన పోవాలంటే ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేసి గెలిపించాలని కోరారు. మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే విధంగా అందరూ భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నాచారం ఎర్రగుంట చెరువును ఏకంగా డంప్ యార్డ్ గా మార్చి.. మురుగునీరు అందులోకి వదలడం వల్ల స్థానిక ప్రజలు అంటూ వ్యాధులతో బాధపడుతున్నారని అయినా  అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అంటూ రేవంత్ రెడ్డి  ఆరోపించారు.


గ్రేటర్ లెక్కలు ఇవే...?

గ్రేటర్ యుద్ధం : బంజారాహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్ధి కోసం రంగంలోకి మంత్రి

గ్రేటర్ యుద్ధం : గ్రేటర్ యుద్ధం : మచ్చ బొల్లారం డివిజన్ లో ఎమ్మెల్యే పద్మా ప్రచారం..?

గ్రేటర్ యుద్ధం : ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..?

గ్రేటర్ యద్ధం: రంగంలోకి బీజేపీ కేంద్ర మంత్రులు, సెలెబ్రిటీలు!

గ్రేటర్ యుద్ధం : జగద్గిరిగుట్ట డివిజన్లో రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే..?

గ్రేటర్ యుద్ధం : కాంగ్రెస్ చేసిన అభివృద్ధే కనిపిస్తుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>