MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-mahesh-babu-reached-huge-fan-following-in-social-media64ed0b0f-6977-481a-a4b6-d58c799dcd5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-mahesh-babu-reached-huge-fan-following-in-social-media64ed0b0f-6977-481a-a4b6-d58c799dcd5e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అందగాడు నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు సినిమా ద్వారా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచిన మహేష్ బాబు తొలి సినిమాతోనే హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో కొనసాగిన మహేష్, కెరీర్ పరంగా ఎన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకుని కోట్లాది మంది ప్రేక్షకుల అలానే అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. superstar mahesh;chalaki chanti;cbn;mahesh;shiva;shruti;ali;chalaki chanti;chanti;mahesh babu;prince;sruthi;sudigali sudheer;rajaka;tollywood;cinema;rajani kanth;jabardasth;festival;media;hollywood;audience;blockbuster hit;lord siva;comedian;alitho saradaga;massసూపర్ స్టార్ మహేష్ తో హాలీవుడ్ సినిమా తీస్తానంటున్న జబర్దస్త్ కమెడియన్ .... ??సూపర్ స్టార్ మహేష్ తో హాలీవుడ్ సినిమా తీస్తానంటున్న జబర్దస్త్ కమెడియన్ .... ??superstar mahesh;chalaki chanti;cbn;mahesh;shiva;shruti;ali;chalaki chanti;chanti;mahesh babu;prince;sruthi;sudigali sudheer;rajaka;tollywood;cinema;rajani kanth;jabardasth;festival;media;hollywood;audience;blockbuster hit;lord siva;comedian;alitho saradaga;massWed, 25 Nov 2020 22:25:40 GMTటాలీవుడ్ అందగాడు నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు సినిమా ద్వారా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచిన మహేష్ బాబు తొలి సినిమాతోనే హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో కొనసాగిన మహేష్, కెరీర్ పరంగా ఎన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకుని కోట్లాది మంది ప్రేక్షకుల అలానే అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ప్రస్తుతం  టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న మహేష్ కి అటు సినిమా నటులు, ప్రముఖుల్లో సైతం ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక అమ్మాయిలు ఫ్యామిలీ ఆడియన్స్ విషయమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యువత, మాస్ ఆడియన్స్ లో కూడా మహేష్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక మహేష్ బాబు సినిమా థియేటర్స్ లోకి వస్తుంది అంటే ఆయన అభిమానుల యొక్క సందడి పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అటువంటి మహేష్ బాబుతో ఒక్క సినిమా చేస్తే చాలు మా జన్మ ధన్యం అయినట్లే అంటూ ఎందరో దర్శక నిర్మాతలు మరియు హీరోయిన్లు బహిరంగంగానే అభిప్రాయపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటించిన శివ మనసులో శృతి సినిమా ద్వారా కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న చలాకి చంటి ఆ తర్వాత జబర్దస్త్ షో లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆకట్టుకునే కామిక్ టాలెంట్ తో మంచి పేరు దక్కించుకున్నాడు. ఇటీవల ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ షో ఆలీతో సరదాగా లో భాగంగా చలాకి చంటి మాట్లాడుతూ తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎప్పటికైనా ఒక భారీ హాలీవుడ్ సినిమా తీయాలనేది లక్ష్యమని, ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆ లక్ష్యాన్ని చేరుకుంటానని చంటి చెప్పడం జరిగింది. మరోవైపు ఇది విన్న మహేష్ అభిమానులు రాబోయే రోజుల్లో అతని కోరిక తప్పనిసరిగా నెరవేరాలని కోరుకుంటూ అతనికి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అల్ ది బెస్ట్ అంటూ విషెస్ తెలియజేస్తున్నారు....!!


ప్రముఖ టివి షో లో కన్నీళ్లు పెట్టించిన కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు ....!!

వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>