MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-and-balakrishna-movie-releases-in-same-dayb1649c8f-7744-4124-a598-975bf756dc55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-and-balakrishna-movie-releases-in-same-dayb1649c8f-7744-4124-a598-975bf756dc55-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి భారీ ఎత్తున నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా తొలిసారిగా ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కాగా కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని తిరు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. chiranjeevi;balakrishna;chiranjeevi;balakrishna;ram charan teja;shiva;boyapati srinu;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;pawan kalyan;ram pothineni;thaman s;tollywood;cinema;sangeetha;nandamuri balakrishna;konidela production;lord siva;heroine;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;yashasvi jaiswal;matinee entertainmentsఒకే రోజున మెగాస్టార్ - బాలయ్య సినిమాలు రిలీజ్ .... ఇక కురుక్షేత్రమేనా ....??ఒకే రోజున మెగాస్టార్ - బాలయ్య సినిమాలు రిలీజ్ .... ఇక కురుక్షేత్రమేనా ....??chiranjeevi;balakrishna;chiranjeevi;balakrishna;ram charan teja;shiva;boyapati srinu;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;pawan kalyan;ram pothineni;thaman s;tollywood;cinema;sangeetha;nandamuri balakrishna;konidela production;lord siva;heroine;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;yashasvi jaiswal;matinee entertainmentsWed, 25 Nov 2020 22:22:04 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి భారీ ఎత్తున నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా తొలిసారిగా ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కాగా కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని తిరు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.

ఇటీవల 50 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి సహా సినిమాలోని పలువురు కీలక నటులపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది మూవీ యూనిట్. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానుంది. మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ ప్రతిష్టాత్మక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత తరంగం తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది.

మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే అటు మెగాస్టార్ ఆచార్య ఇటు బాలయ్య బోయపాటి సినిమాలు రెండూ కూడా వేసవి సమయంలో ఒకే రోజున రిలీజ్ కానున్నట్లు టాక్. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి అంజి అలానే బాలయ్య లక్ష్మీనరసింహా సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ అయ్యాయి. అలానే అంతకుముందు నరసింహనాయుడు, మృగరాజు సినిమాలు కూడా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అటు నందమూరి ఇటు మెగా హీరోల సినిమాలు రెండూ కూడా ఒకే రోజు రిలీజ్ కావడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం ఈ ఇద్దరు బడా స్టార్ల బాక్సాఫీస్ కురుక్షేత్రం మొదలైనట్లే అంటున్నారు విశ్లేషకులు....!!


ప్రముఖ టివి షో లో కన్నీళ్లు పెట్టించిన కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు ....!!

వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>