PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nivar-thufan-effecte163b5bf-9e60-48ef-9c18-e08f3aa8a92e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nivar-thufan-effecte163b5bf-9e60-48ef-9c18-e08f3aa8a92e-415x250-IndiaHerald.jpgచెన్నైలో మొదలైన నివర్ తుఫాన్ ప్రభావం. నిన్న( మంగళవారం) నుండి మొదలైన భారీ వర్షాలు. నిన్న భారీ వర్షంతో తడిసి ముద్దయింది చెన్నై. ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.... లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి, రోడ్లపై పెద్ద ఎత్తున నీళ్లు నిలచి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అయితే నివర్ తుఫాను చెన్నైకి దక్షిణాన తీరం దాటుతుందని భావిస్తున్నా... అటు దక్షిణాంధ్ర ప్రాంతం పైన కూడా విపరీతంగా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.nivar thufan effect;editor mohan;varsha;jagan;andhra pradesh;telangana;kadapa;chief minister;chennai;sv mohan reddy;reddy;varshamనివర్ తుఫాన్ ప్రభావం...చెన్నై తడిసి ముద్దయింది...!నివర్ తుఫాన్ ప్రభావం...చెన్నై తడిసి ముద్దయింది...!nivar thufan effect;editor mohan;varsha;jagan;andhra pradesh;telangana;kadapa;chief minister;chennai;sv mohan reddy;reddy;varshamWed, 25 Nov 2020 12:00:00 GMTఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని  అంచనా వేస్తూ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి.. తగిన సూచనలు చేసి అధికారులను అప్రమత్తం చేశారు.

తుఫాను నేరుగా ఏపీ పై ప్రభావం చూపక పోయినా .. దాని ప్రభావం దక్షిణ ఆంధ్ర జిల్లాలతోపాటు అటు రాయలసీమలోను చిత్తూరు, కడప జిల్లాలపై తీవ్రంగా ఉంటుంది అంటూ వాతావరణ శాఖ నివేదిక సమర్పించగా... దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశిస్తూ అప్రమత్తం చేశారు. ఈ విషయంపై అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా అలర్ట్ చేయాలని.... అధికారులు కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో...చిత్తూరు తీర ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది కావున... అటు ప్రజలు ఇటు అధికారులు అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. కాగా ఈ రోజు నెల్లూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో...చిత్తూరు, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం కారణంగా రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.. అలాగే ఎల్లుండి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  తెలుస్తోంది. కాబట్టి అధికారులు సూచించిన విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటే నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడొచ్చు.


ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరుచుకోవాలి.. లేకపోతే..?

గత పాలకులు చేసిన తప్పే కేసీఆర్ చేస్తున్నారా..?

గ్రేటర్ యుద్ధం : ఈసారి 110 సీట్లు మావే : మన్నే కవిత

గ్రేటర్ యుద్ధం : జీడిమెట్లలో బీజేపీ అభ్యర్థి తార చంద్ర రెడ్డి ప్రచారం..?

గ్రేటర్ యుద్దం: నిధులు ఇస్తామని ఒకరు..ఇవ్వకున్న సత్తా చూపిస్తామని మరొకరు..

గ్రేటర్ యుద్ధం: అడిక్‌మెట్ డివిజన్‌లో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల పోటాపోటీగా ప్రచారం..

నగర యువత కు మధుమేహ ముప్పు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>