HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/bharat-biotech-tie-up-for-covid-nasal-spray-vaccine810b2934-4a48-4f97-ab41-e9117d8049cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/bharat-biotech-tie-up-for-covid-nasal-spray-vaccine810b2934-4a48-4f97-ab41-e9117d8049cb-415x250-IndiaHerald.jpgతాము తయారుచేసిన స్పుత్నిక్-వీ టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని రష్యా ప్రకటించింది. ఒక డోసు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 10 డాలర్లు(సుమారు రూ.740) లోపే ఉంటుందని.. ఈ టీకా రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుందని రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ హెడ్ కిరిల్ దిమిత్రోవ్ తెలిపారు.sputnik;russia;american samoa;director;minister;international;v;coronavirus95 శాతం ప్రభావం చూపే రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ధర ఖరారు!95 శాతం ప్రభావం చూపే రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ధర ఖరారు!sputnik;russia;american samoa;director;minister;international;v;coronavirusWed, 25 Nov 2020 17:05:00 GMTకరోనా వైరస్ మహమ్మారి నిర్మూలన కోసం జరుగుతోన్న వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకుంటున్నాయి. టీకా ఫలితాలు సానుకూలంగా ఉన్నట్టు ఇటీవల మోడెర్నా, ఫైజర్ నివేదికలు వెల్లడించాయి. తాజాగా మరో సంస్థ సైతం శుభవార్త అందించింది. తాము తయారుచేసిన స్పుత్నిక్-వీ టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని రష్యా ప్రకటించింది. ఒక డోసు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 10 డాలర్లు(సుమారు రూ.740) లోపే ఉంటుందని.. ఈ టీకా రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుందని రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ హెడ్ కిరిల్ దిమిత్రోవ్ తెలిపారు.


తొలి డోస్ తీసుకున్నవారిలో 42 రోజుల తర్వాత టీకా 95 శాతం ప్రభావంతంగా పనిచేస్తోందని వివరించారు. క్లినికల్ ట్రయల్స్2లో భాగంగా 22 వేల మంది వాలంటీర్లకు 42 రోజుల కిందట తొలి డోసు, 19 వేల మందికి 21 రోజుల కిందట రెండో డోసు ఇచ్చామని రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలను గమలేయా నేషనల్‌ సెంటర్‌, ఆర్‌డీఐఎఫ్‌ సంయుక్తంగా వెల్లడించాయి. క్లినికల్ ట్రయల్స్‌లో ధ్రువీకరించిన 39 కేసులు, రెండు డోస్‌లు తీసుకున్న 18,794 మంది వాలంటీర్లలో స్పుత్నిక్- v 28 వ రోజు 91.4 శాతం, 42 వ రోజు 95 శాతంపైగా ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలిందని ప్రకటించింది.ప్రపంచంలో అత్యంత సమర్థంగా పనిచేస్తున్న టీకా తమదేనని, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో 40 వేల మంది వాలంటీర్లు పాల్గొంటున్నారని పేర్కొన్నాయి.


బెలారస్‌, యూఏఈ, వెనుజువెలాతో పాటు భారత్‌లోనూ ఫేజ్‌-3 ట్రయల్స్‌కు అనుమతి లభించినట్టు ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది. 2021 తొలి నాళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 కోట్ల డోసుల ఉత్పత్తి ప్రారంభించేలా పలు దేశాలతో ఒప్పందాలు కుదిరినట్టు వివరించింది. ‘తాము తయారుచేసిన టీకా అధిక సామర్థ్యాన్ని ప్రదర్శించే డేటా, కొత్తరకం కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో అతి ముఖ్యమైన సాధనాన్ని త్వరలో పొందుతామని ఆశిస్తున్నాం’ అని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో వ్యాఖ్యానించారు. భారత్‌లో డాక్డర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆగస్టులోనే ఈ వ్యాక్సిన్‌కు రష్యా ఆమోదం తెలపడంతో ప్రపంచంలోనే క్లినికల్ ఆమోదం పొందిన తొలి టీకాగా గుర్తింపు పొందింది. అమెరికా సంస్థలు ఫైజర్‌, మోడెర్నాలు సైతం తమ టీకాలు 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌-అస్ట్రాజెనెకా.. తమ టీకా 70 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని సోమవారం ప్రకటించింది.




గ్రేటర్ యుద్దం: ప్రతి ఇంటికి కేసీఆర్ పెద్ద కొడుకు లాంటోడు..రంజిత్ రెడ్డి..

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరుచుకోవాలి.. లేకపోతే..?

గ్రేటర్ యుద్దం: బి‌జే‌పి ఎం‌పి అరవింద్ పై కేసు నమోదు..ఎందుకు..?

గ్రేటర్ యుధ్ధం :ఆహ... బిజెపిని ఎదుర్కోవడానికి తెరాస ప్లాన్ సూపర్

గ్రేటర్ యుధ్ధం :బాలయ్య షాక్ ఇచ్చారా...?

గ్రేటర్ యుద్దం: మేయర్ సీటు మాదే..ఉప్పల్ రోడ్ షోలో "బండి సంజయ్" వ్యాఖ్యలు ..!!

గ్రేటర్ యుధ్ధం : రేవంత్ మీద విజయశాంతిని ప్రయోగిస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>