EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/what-is-the-yellowmedia-problem-on-vizag-development9f5fbb29-63d4-4d08-b2f1-920c66d5d334-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/what-is-the-yellowmedia-problem-on-vizag-development9f5fbb29-63d4-4d08-b2f1-920c66d5d334-415x250-IndiaHerald.jpgఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే చంద్రబాబు హయాంలోనే అదాని డేటా సెంటర్ ఏర్పాటు కాలేదు. ఎందుకంటే వాళ్ళతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న మూడేళ్ళ తర్వాత కూడా సెంటర్ ఏర్పాటు కాలేదన్నది వాస్తవం. ఎంవోయు కుదుర్చుకున్న తర్వాత కూడా ఎందుకు సెంటర్ ఏర్పాటు కాలేదు ? ఎందుకంటే సెంటర్ ఏర్పాటుకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన భూమి వివాదాస్పదమైనదట. ప్రభుత్వం మారిన తర్వాత ఈ విషయాన్ని సంస్ధ ప్రతినిధులు చెప్పగానే జగన్ వాళ్ళకిచ్చిన భూమిని రద్దు చేశారు. సంస్ధ యాజమాన్యంతో చర్చలు జరిపి కొత్తగా మరో చోట భూమిని కేటాయvizag yellowmedia jagan naidu adani tdp ycp;cbn;yajamanya;visakhapatnam;jagan;andhra pradesh;industries;vishakapatnam;government;reliance;tdp;ycp;lokesh kanagaraj;reddyహెరాల్డ్ ఎడిటోరియల్ : వైజాగ్ పై ఎల్లోమీడియా బాధ ఏమిటో అర్ధం కావటం లేదే ?హెరాల్డ్ ఎడిటోరియల్ : వైజాగ్ పై ఎల్లోమీడియా బాధ ఏమిటో అర్ధం కావటం లేదే ?vizag yellowmedia jagan naidu adani tdp ycp;cbn;yajamanya;visakhapatnam;jagan;andhra pradesh;industries;vishakapatnam;government;reliance;tdp;ycp;lokesh kanagaraj;reddyWed, 25 Nov 2020 05:00:00 GMTఇంతకాలం వైజాగ్ ఏర్పాటయ్యే పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం తరిమేసిందంటూ ఎల్లోమీడియా నానా గోల చేసింది. వెళిపోయాయని చెబుతున్న పరిశ్రమలే ఇపుడు మళ్ళీ వైజగ్ లో యూనిట్లు పెట్టడానికి రెడీ అవుతుంటే ఇదంతా టీడీపీ గొప్పే గానీ జగన్మోహన్ రెడ్డి గొప్పేమీ కాదంటు మళ్ళీ గోల మొదలుపెట్టింది. ఇంతకీ అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు, యూనిట్లు ఏపి నుండి వెళ్ళిపోయినట్లా ? రాష్ట్రంలోకి ఇపుడు కొత్తగా వచ్చినట్లా ? అనే విషయం జనాలకు అర్ధం కావటంలేదు.  జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు యావత్ ఎల్లోబ్యాచ్ ఓ పాట అందుకుంది. అదేమిటంటే  తమ హయాంలో వైజాగ్ అభివృద్ధికి తీసుకొచ్చిన అదాని డేటా సెంటర్ ను జగన్ ప్రభుత్వం వెళ్ళగొట్టేసిందని.  అదాని డేటా సెంటర్ తో పాట తాము కష్టపడి తెచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం వెళ్ళగొట్టేసిందని ఓ లక్షసార్లన్నా ఆరోపణలు చేసుంటారు. ఇదే విషయాన్ని చెత్తపలుకులో కూడా ఎల్లోమీడియా చాలా ప్రముఖంగా ప్రస్తావించింది. ఒకవేళ అదే నిజమనుకుంటే మరిపుడు వైజాగ్ లో ఏర్పాటవ్వబోతున్న అదాని డేటా సెంటర్  ఘనత ఎవరికి దక్కుతుంది ?




ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే  చంద్రబాబు హయాంలోనే అదాని డేటా సెంటర్ ఏర్పాటు కాలేదు. ఎందుకంటే వాళ్ళతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న మూడేళ్ళ తర్వాత కూడా సెంటర్ ఏర్పాటు కాలేదన్నది వాస్తవం. ఎంవోయు కుదుర్చుకున్న తర్వాత కూడా ఎందుకు సెంటర్ ఏర్పాటు కాలేదు ? ఎందుకంటే సెంటర్ ఏర్పాటుకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన భూమి వివాదాస్పదమైనదట.  ప్రభుత్వం మారిన తర్వాత ఈ విషయాన్ని సంస్ధ ప్రతినిధులు చెప్పగానే  జగన్ వాళ్ళకిచ్చిన భూమిని  రద్దు చేశారు. సంస్ధ యాజమాన్యంతో చర్చలు జరిపి కొత్తగా మరో చోట భూమిని కేటాయించారు. దాంతో ఇపుడు రూ. 20 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైపోయింది. దీన్నే ఇపుడు ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. చంద్రబాబు హయాంలో వచ్చిన యూనిట్లను, పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం వెళ్ళగొట్టేస్తే మళ్ళీ ఎందుకు వస్తాయి ?




ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏ పరిశ్రమను వైసీపీ ప్రభుత్వం వెళ్ళగొట్టలేదు. అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూములే వివాదాస్పదమయ్యాయి. దాంతో వాళ్ళకు వేరే చోట్ల భూములు కేటాయించటం ఆలస్యమైందంతే. రేణిగుంటలో కూడా రిలయన్స్ కు కేటాయించిన భూమి కూడా వివాదాస్పదమైంది. దాన్ని  కూడా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పరిష్కరించారు. ఇలా ఒక్కో పరిశ్రమ వివాదాన్ని జగన్ పరిష్కరిస్తు ఏర్పాటుకు మార్గం రెడీ చేస్తున్నారు. దీన్నే చంద్రబాబు, ఎల్లోమీడియా తట్టుకోలేకపోతున్నారు.  తమ హయాంలో వచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం వెళ్ళగొట్టేసిందని చేసిన ఆరోపణలు, ప్రచారమంతా అబద్ధాలే అని తేలిపోతున్నాయి. దాంతో ఏమి చేయాలో అర్ధంకావటం లేదు. అందుకనే కొత్త పల్లవి ఎత్తుకున్నారు. జగన్ ప్రభుత్వంలో వచ్చినట్లు చెప్పుకుంటున్న పరిశ్రమలు, యూనిట్లన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే అంటూ ఎల్లోమీడియా కొత్తరాగం అందుకుంది. చంద్రబాబు హయాంలో వచ్చిన వాటినే తమ హయంలో వచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటోందంటూ పిచ్చి రాతలు రాస్తోంది.  పరిశ్రమలను వెళ్ళగొట్టిందన్నా నిజమయ్యుండాలి లేకపోతే ఇపుడు వస్తున్న యూనిట్లన్నా నిజమయ్యుండాలి. అంతేకానీ అప్పుడు వెళ్ళగొట్టేశారని రాసి ఇపుడు టీడీపీ హయాంలో వచ్చిన వాటినే తమ ఘనతగా చెప్పుకుంటున్నాయని రాస్తున్నాయంటే ఏమిటర్ధం ?





RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

తమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>