MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruti-hasan-left-shooting-angry-over-staff36610923-3fab-4002-a521-11fbe8bb0728-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruti-hasan-left-shooting-angry-over-staff36610923-3fab-4002-a521-11fbe8bb0728-415x250-IndiaHerald.jpgహీరోయిన్ శ్రుతిహాసన్ తండ్రి చాటు కూతురిలా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని స్టార్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు అన్నీ మళ్లీ ట్రాక్ మీదకు వస్తున్నాయి. స్టార్‌లందరూ షూటింగ్‌లకు హాజరవుతున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఓ సినిమా షూటింగ్ విషయంపై నటి శ్రుతిహాసన్ ఫైర్ అయ్యారని తెలిసింది.shrutihaasan;sethu;vijay;vijay sethupathi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;cinema;telugu;tamil;twitter;hindi;husband;hero;heroine;joseph vijay;fatherసినిమా షూటింగ్ సిబ్బందిపై శ్రుతి హాసన్ ఫైర్.. షూటింగ్‌ మధ్యలోనే బయటకు వచ్చిన నటి!సినిమా షూటింగ్ సిబ్బందిపై శ్రుతి హాసన్ ఫైర్.. షూటింగ్‌ మధ్యలోనే బయటకు వచ్చిన నటి!shrutihaasan;sethu;vijay;vijay sethupathi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;cinema;telugu;tamil;twitter;hindi;husband;hero;heroine;joseph vijay;fatherTue, 24 Nov 2020 11:21:22 GMTహీరోయిన్ శ్రుతిహాసన్ తండ్రి చాటు కూతురిలా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని స్టార్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు అన్నీ మళ్లీ ట్రాక్ మీదకు వస్తున్నాయి. స్టార్‌లందరూ షూటింగ్‌లకు హాజరవుతున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఓ సినిమా షూటింగ్ విషయంపై నటి శ్రుతిహాసన్ ఫైర్ అయ్యారని తెలిసింది.

వివరాల్లోకి వెళ్తే.. కరోనా కారణంగా దాదాపుగా ఎనిమిది నెలలుగా షూటింగ్‌కు దూరంగా ఉన్న శ్రుతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఓ వైపు తెలుగులో చేస్తూనే తమిళంలో కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే ఇటీవలే ఆమె ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారట. అయితే ఆమె షూటింగ్‌ జరుగుతున్న సమయంలో.. ప్యాకప్ చెప్పేసి మధ్యలోనే బయటకు వచ్చేశారట. కారణంమేంటని ఆరా తీస్తే ఆమె షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నవారు తండోపతండాలుగా వస్తున్నారట. దీంతో కరోనా భయంతో శ్రుతి హాసన్ సినిమా షూటింగ్ నుంచి వెళ్లిపోయిందట.

ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న సినిమా ‘లాభం’. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఈ తమిళ సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికే.. పరిసర ప్రాంత వాసులు భారీగా హాజరవుతున్నారని, అక్కడి సిబ్బంది కరోనా జాగ్రత్తలు ఏవీ తీసుకోవడం లేదని, అందుకే శ్రుతి హాసన్ బయటకు వచ్చేశారని అందరూ అనుకుంటున్నారు. ఆమె కూడా సిబ్బందిపై ఫైర్ అయ్యారట. షూటింగ్‌ చూడడానికి వస్తోన్న ప్రజలను కంట్రోల్ చేయలేకపోతే ఎలా?అని అసహనం వ్యక్తం చేశారట. ఈ విషయం గురించి ఆమె తన ట్వట్టర్‌‌లో ఇలా రాసుకొచ్చారు. `కరోనా అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఇంకా అంత‌రించిపోలేదు. కరోనా ప్రోటోకాల్స్‌ పాటించని పక్షంలో.. ఓ మహిళగా, నటిగా నా భద్రత కోసం జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉంది`అని ట్వీట్ చేసింది.

" style="height: 328px;">




పది మంది ముందు అవమానిస్తారా...? లోకేష్ ఆవేదన

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!

డబ్బే డబ్బు : ఆచితూచి అడుగులు వేయవలసిన సమయంలో స్టాక్ మార్కెట్ !

గుడ్ న్యూస్ : ఇక సిమ్ లేకుండానే కాల్ మాట్లాడొచ్చు..?

ఎంఐ ఫోన్లు కొనాలనుకుంటన్నారా? ఇది ఒకసారి చూడండి..

బీజేపీ టంగ్ స్లిప్...ఆ ఓట్లు గల్లంతే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>