PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-schools07d5c5bf-017d-4e4f-9851-78bcef4f7621-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-schools07d5c5bf-017d-4e4f-9851-78bcef4f7621-415x250-IndiaHerald.jpgలాక్ డౌన్ అనంతరం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు పునఃప్రారంభించడానికి వెనకడుగు వేస్తున్న టైమ్ లో ఏపీ ప్రభుత్వం ధైర్యంగా స్కూళ్లు తెరిచింది. రోజు మార్చి రోజు సగం మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చేట్లు, ముందుగా 9, 10 తరగతుల క్లాసులు మొదలు పెట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇదే విధానం పాటిస్తోంది. అయితే 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మాత్రం మరో షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 14నుంచి ప్రైమరీ సెక్షన్ కూడా మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విషap schools;kranthi;kranti;makar sakranti;andhra pradesh;dr. rajasekhar;sankranthi;school;december;96;marchఏపీ స్కూళ్లలో ప్రైమరీ సెక్షన్ లేనట్టేనా..?ఏపీ స్కూళ్లలో ప్రైమరీ సెక్షన్ లేనట్టేనా..?ap schools;kranthi;kranti;makar sakranti;andhra pradesh;dr. rajasekhar;sankranthi;school;december;96;marchTue, 24 Nov 2020 12:00:00 GMTఏపీ ప్రభుత్వం ధైర్యంగా స్కూళ్లు తెరిచింది. రోజు మార్చి రోజు సగం మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చేట్లు, ముందుగా 9, 10 తరగతుల క్లాసులు మొదలు పెట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇదే విధానం పాటిస్తోంది. అయితే 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మాత్రం మరో షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 14నుంచి ప్రైమరీ సెక్షన్ కూడా మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విషయంలో ప్రభుత్వం రిస్క్ చేసేలా కనిపించడంలేదు.

రాష్ట్రంలోని స్కూళ్లలో తరగతుల ప్రారంభంపై ఇంతకు ముందు ఇచ్చిన జీవోకు స్వల్ప సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం జీవో 229 విడుదల చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు పాఠశాలల్లో తగినంత స్థలం అందుబాటులో లేనందున ఈ సవరణ చేస్తున్నట్లు ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా జీవో ప్రకారం డిసెంబర్‌ 14వ తేదీ నుంచి అన్ని స్కూళ్లలో 6, 7 తరగతులను మాత్రమే ప్రారంభిస్తారు. సంక్రాంతి సెలవల అనంతరం పరిస్థితులను బట్టి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. సూళ్లను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

రాష్ట్రంలోని పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభించిన తొలిరోజే అత్యధిక సంఖ్యలో హాజరు నమోదైంది. ఈ నెల 2 నుంచి ఇప్పటి వరకు 9, 10 తరగతులకు బోధన జరిగింది. సోమవారం 8వ తరగతి విద్యార్థుల తరగతులు ప్రారంభించారు. 46.28 శాతం 10వ తరగతి విద్యార్థులు, 41.61 శాతం 9వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 8వ తరగతి విద్యార్థులు అత్యధికంగా 69.72 శాతం హాజరయ్యారు. మొత్తం 5,70,742 మంది విద్యార్థులకు గాను 3,96,809 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు.

అయితే ప్రైమరీ సెక్షన్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా ఆలోచన చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులను స్కూళ్లకు అనుమతించాలని అనుకుంటున్నారు అధికారులు. ఆ లెక్కన చూస్తే.. ఈ విద్యాసంవత్సరంలో ఏపీలో ప్రైమరీ సెక్షన్ పూర్తిగా లేనట్టే చెప్పాలి. అందర్నీ ఆటోమేటిక్ గా పై తరగతులకు ప్రమోట్ చేసి సిలబస్ ని మదింపు చేస్తారు. 


నిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్ట్ కి జగన్...?

ఆర్ ఆర్ ఆర్ కోసం అమీర్ ఖాన్.. జక్కన్న ప్లాన్ అదిరింది !

ఆ పొరబాటు.. కరోనా టీకా పవర్ పెంచింది?

సినిమా షూటింగ్ సిబ్బందిపై శ్రుతి హాసన్ ఫైర్.. షూటింగ్‌ మధ్యలోనే బయటకు వచ్చిన నటి!

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!

డబ్బే డబ్బు : ఆచితూచి అడుగులు వేయవలసిన సమయంలో స్టాక్ మార్కెట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>