WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant14912067-7184-4475-b3e0-6f2777022a25-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant14912067-7184-4475-b3e0-6f2777022a25-415x250-IndiaHerald.jpgబిడ్డకు జన్మనివ్వాలి అనుకోవడం ప్రతి ఆడపిల్ల కోరిక. అయితే మహిళలు గర్బం దాల్చిన దగ్గర నుండి డెలివరీ అయ్యే వరకు చాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యలు చెబుతుంటారు. ఇక గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాలి. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఏయే ఆహార ప‌దార్థాల‌ను తిన‌మ‌ని చెబుతారో వాటినే తినాలి. అంతేకానీ.. తెలిసీ తెలియ‌కుండా ఏది ప‌డిదే ఆ ఆహారాన్ని తిన‌కూడ‌దు.pregnant;girl;abortionగ‌ర్భిణీలు ఈ ఫుడ్‌ను తింటున్నారా.. తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..!గ‌ర్భిణీలు ఈ ఫుడ్‌ను తింటున్నారా.. తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..!pregnant;girl;abortionTue, 24 Nov 2020 15:00:00 GMTఆడపిల్ల కోరిక. అయితే మహిళలు గర్బం దాల్చిన దగ్గర నుండి డెలివరీ అయ్యే వరకు చాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యలు చెబుతుంటారు. ఇక గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాలి. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఏయే ఆహార ప‌దార్థాల‌ను తిన‌మ‌ని చెబుతారో వాటినే తినాలి. అంతేకానీ.. తెలిసీ తెలియ‌కుండా ఏది ప‌డిదే ఆ ఆహారాన్ని తిన‌కూడ‌దు. ముఖ్యంగా రెడీ టు ఈట్ ఫుడ్‌ను గ‌ర్భిణీలు అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌. తింటే అనేక దుష్ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. రెడీ టు ఈట్ ఫుడ్‌ను గ‌ర్భిణీలు తింటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌పై ఆ ఫుడ్ ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ట‌.

ఇక రెడీ టు ఈట్ ఫుడ్ అంటే.. నిల్వ చేసిన ఆహార ప‌దార్థాలు అన్న‌మాట‌. వాటిని వండాల్సిన ప‌ని ఉండ‌దు. నేరుగా తినేయ‌డ‌మే. ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల రెడీ టు ఈట్ ఫుడ్ ఐట‌మ్స్ ల‌భిస్తున్నాయి. అయితే వీటికి గ‌ర్భిణీలు ఎంత వీలైతే అంత దూరంగా ఉండాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. రెడీ టు ఈట్ ఫుడ్‌ను గ‌ర్భిణీలు తింటే వారికి పుట్ట‌బోయే పిల్ల‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పుడతార‌ట‌. అంతేకాకుండా ఆ ఫుడ్ మాన‌వ ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌పై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని, దీంతో వారికి సంతానం క‌లిగే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

అంతేకాదు రెడీ టు ఈట్ ఫుడ్‌ను తిన‌డం వ‌ల్ల గ‌ర్భిణీల‌కు కొన్ని సంద‌ర్భాల్లో అబార్ష‌న్ అయ్యే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే మ‌హిళ‌ల‌కు పాలిసిస్టిక్ ఒవేరియ‌న్ సిండ్రోమ్ అనే స‌మ‌స్య వ‌స్తుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అన్ని ర‌కాల పోష‌కాలు క‌లిగిన పండ్లు, తాజా కూర‌గాయ‌లను బాగా తింటే.. పుట్ట‌బోయే పిల్ల‌లు ఆరోగ్యంగా ఉంటారు..!




కరోనా వ్యాక్సిన్ ముందుగా వారికి మాత్రమే ఇస్తారట.. ఎందుకంటే?

అప్పుడే రంగంలోకి దిగిన టీడీపీ... శనివారమే...!

విశాఖ వైసీపీలో ఫోటోల చిచ్చు

అప్పుడు ఎందుకు ఇవ్వలేదు...? ఇప్పుడు ఎందుకు ఇస్తారు కేసీఆర్...?

వైసీపీలో తారస్థాయికి చేరిన ఎమ్మెల్యే, ఎంపీ విభేదాలు!

గర్భవతి తో సహజీవనం... తేడా రావడంతో ఆమె ప్రాణం పోయింది..??

కోహ్లీ లేకపోతే కష్టమే.. కానీ.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>