PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp3eac7d57-a01f-4475-a8ab-fa4ca89b8d68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp3eac7d57-a01f-4475-a8ab-fa4ca89b8d68-415x250-IndiaHerald.jpgఇటీవల తెలుగుదేశం పార్టీలో పదవుల పంపకాలు జరిగిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి ధీటుగా ఉండేందుకు చంద్రబాబు, పార్టీలో కీలక పదవులు భర్తీ చేశారు. రాష్ట్ర అధ్యక్షులతో పాటు చాలా పదవులని భర్తీ చేశారు. అయితే టీడీపీలో కీలకంగా ఉన్న ఓ పదవిని మాత్రం భర్తీ చేయలేదు. యువతని ఆకర్షించే తెలుగు యువత అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టలేదు. తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడుగా పొగాకు జయరాం ఉంటే, ఏపీకి అధ్యక్షుడుగా ఎవరు లేరు. tdp;sriram;ram mohan naidu kinjarapu;telangana;devineni avinash;2019;telugu;tdp;paritala ravindra;partyటీడీపీలో ఆ పదవి ఎవరికి దక్కుతుందో?టీడీపీలో ఆ పదవి ఎవరికి దక్కుతుందో?tdp;sriram;ram mohan naidu kinjarapu;telangana;devineni avinash;2019;telugu;tdp;paritala ravindra;partyTue, 24 Nov 2020 04:00:00 GMTతెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడుగా పొగాకు జయరాం ఉంటే, ఏపీకి అధ్యక్షుడుగా ఎవరు లేరు.

గతంలో ఈ పదవిలో దేవినేని అవినాష్ ఉండేవారు. అవినాష్ ఉన్నప్పుడు యువత ఫాలోయింగ్ టీడీపీకి గట్టిగానే పెరిగింది.  అవినాష్ బాగానే కష్టపడి పార్టీ కోసం పనిచేశారు. కానీ 2019 ఎన్నికల తర్వాత అవినాష్ టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. దీంతో తెలుగు యువత పదవి మాత్రం అలాగే ఖాళీగా ఉండిపోయింది. ఇంతవరకు ఆ పదవిని వేరే వాళ్ళకు ఇవ్వలేదు.

ఈ పదవి రామ్మోహన్ నాయుడుకు గానీ, పరిటాల శ్రీరామ్‌కు గానీ ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరికీ పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. రామ్మోహన్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వగా, రాష్ట్ర కమిటీలో పరిటాల శ్రీరామ్‌కు చోటు దక్కింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పరిటాల శ్రీరామ్ నియమితులయ్యారు. మరి దీని బట్టి చూసుకుంటే వీరికి తెలుగు యువత దక్కడం కష్టమనే చెప్పొచ్చు.

అయితే తెలుగు యువత నాదెండ్ల బ్రహ్మంకు దక్కే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. బ్రహ్మంని టి‌ఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడుగా తొలగించి వేరే వాళ్ళకు ఇచ్చారు. దీంతో బ్రహ్మాంకు తెలుగు యువత దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు, ఎప్పుడు ప్రకటిస్తారని పార్టీలోని యువత ఎదురుచూస్తుంది. అయితే పదవి ఎవరికి ఇవ్వకుండా నారా లోకేష్‌కు అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. మరి చూడాలి యువతని ఆకర్షించే ఈ పదవిని ఎవరికి అప్పగిస్తారో?




మోడీ బలే వ్యూహం.. కాశ్మీర్ కి సౌదీ మద్దతు.. ఇమ్రాన్ కి ఊహించని షాక్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>