ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/festiv4fd7a420-f753-45a4-8807-2247c2e443d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/festiv4fd7a420-f753-45a4-8807-2247c2e443d2-415x250-IndiaHerald.jpgచెక్ బ్రాండ్స్ రిపోర్టులో సోషల్‌ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ట్విట్టర్, గూగుల్‌ సెర్చ్, యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ ప్రధాని పేరుపై ఉన్నాయని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో నిలిచారు. మోదీ తర్వాతి స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2,137 ట్రెండ్స్‌తో రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందిjagan;soniagandhi;benarjee;delhi;jagan;andhra pradesh;narendra modi;mamata banerjee;mohandas karamchand gandhi;sonia gandhi;media;prime minister;chief minister;social media;twitter;car;uttar pradesh;minister;cheque;central government;mamta mohandas;narendraజగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!jagan;soniagandhi;benarjee;delhi;jagan;andhra pradesh;narendra modi;mamata banerjee;mohandas karamchand gandhi;sonia gandhi;media;prime minister;chief minister;social media;twitter;car;uttar pradesh;minister;cheque;central government;mamta mohandas;narendraTue, 24 Nov 2020 17:30:00 GMTసాధారణంగా సినీ తారలకు అలాగే క్రీడాకారులకు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉంటుంది. రాజకీయ నేతలకు మాత్రం సోషల్ మీడియాలో కొంచెం తక్కువగానే క్రేజ్ ఉంటుంది. కానీ గత కొద్ది కాలంగా సినీ తారలకు అలాగే క్రీడాకారులకు కూడా ఏమాత్రం తగ్గకుండా రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. వారి అకౌంట్లకు ఫాలోయింగ్ మామూలుగా ఉండటం లేదు. వీరికి అత్యంత ప్రజాదరణ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న నేతలపై ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ వరకు సోషల్‌ మీడియా టాప్‌ ట్రెండ్స్‌ను చెక్‌ బ్రాండ్స్‌ సంస్థ నివేదిక రూపంలో విడుదల చేసింది. ఈ మూడు నెలల కాలంలో 95 మంది టాప్‌ పొలటికల్‌ లీడర్లు, 500 మందికి సంబంధించి ట్రెండ్స్‌ను చెక్‌ బ్రాండ్స్‌ విశ్లేషించింది.




చెక్ బ్రాండ్స్ రిపోర్టులో సోషల్‌ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ట్విట్టర్, గూగుల్‌ సెర్చ్, యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ ప్రధాని పేరుపై ఉన్నాయని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో నిలిచారు. మోదీ తర్వాతి స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2,137 ట్రెండ్స్‌తో రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. ఇటు బ్రాండ్‌ స్కోర్‌ విషయంలో 70 స్కోర్‌తో మోదీ తొలి స్థానంలో ఉన్నారు. సోషల్‌మీడియా వేదికలపై ఫాలోవర్స్, ట్రెండ్స్, సెంటిమెంట్స్, ఎంగేజ్‌మెంట్, మెన్షన్స్‌.. ఆధారంగా బ్రాండ్‌ స్కోర్‌ను నిర్ధారిస్తారు. ఈ స్కోర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 36.43 స్కోర్‌తో రెండో స్థానం.. అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ (31.89), అరుణాచల్‌ సీఎం పెమా ఖండూ (31.89), యూపీ సీఎం ఆదిత్యనాథ్‌(27.03) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బ్రాండ్‌ వ్యాల్యూలోనూ మోదీనే తొలి స్థానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్‌ వాల్యూ రూ. 336 కోట్లు. ఆ తరువాతి స్థానాల్లో అమిత్‌ షా(రూ. 335 కోట్లు), ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(రూ. 328 కోట్లు) ఉన్నారు. బ్రాండ్‌ వాల్యూని ఫాలోవర్లు, ఎంగేజ్‌మెంట్స్, ట్రెండ్స్‌ ఆధారంగా నిర్ధారిస్తారు.




హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరినీళ్లలా మారుస్తామన్నారే ఏమైంది?: ఉత్తమ్

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

తమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!

'కే‌సి‌ఆర్' ను పొగడ్తలతో ముంచిన 'మహేష్ బాబు'..!!

అప్పుడే రంగంలోకి దిగిన టీడీపీ... శనివారమే...!

విశాఖ వైసీపీలో ఫోటోల చిచ్చు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>