PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-electionsbb8dc21a-a4ba-4ed1-a3fe-cc14f36c369d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-electionsbb8dc21a-a4ba-4ed1-a3fe-cc14f36c369d-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం ఆయా పార్టీలు, ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి, ఎన్నికల ప్రచారానికి ఎంతో సమయం ఇవ్వకపోవడంతో డివిజన్లలోని ఓటర్లను కలవడం పెద్ద తలనొప్పిగా మారింది. అతి తక్కువ సమయంలో ఓటర్లు అందరినీ పలకరించడం సాధ్యం కాకపోవడంతో, కాలనీ లోని ముఖ్యమైన ప్రదేశాల్లోనూ, కాలనీ కమిటీల తోనూ, ఆ డివిజన్ పరిధిలో ఉన్న కీలకమైన తటస్థ వ్యక్తులను కలుస్తూ , తమకు అండ గా ఉండాల్సిందిగా కోరుతూ వస్తున్నారు. దీనికోసం అభ్యర్థులు గట్టిghmc trs bjp congress telangana;auto;prasanna;letter;partyసొమ్ముల వల... ఓట్ల కోసం విలవిల ?సొమ్ముల వల... ఓట్ల కోసం విలవిల ?ghmc trs bjp congress telangana;auto;prasanna;letter;partyTue, 24 Nov 2020 01:00:00 GMTగ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం ఆయా పార్టీలు,  ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి, ఎన్నికల ప్రచారానికి ఎంతో సమయం ఇవ్వకపోవడంతో డివిజన్లలోని ఓటర్లను కలవడం పెద్ద తలనొప్పిగా మారింది. అతి తక్కువ సమయంలో ఓటర్లు అందరినీ పలకరించడం సాధ్యం కాకపోవడంతో, కాలనీ లోని ముఖ్యమైన ప్రదేశాల్లోనూ,  కాలనీ కమిటీల తోనూ, ఆ డివిజన్ పరిధిలో ఉన్న కీలకమైన తటస్థ వ్యక్తులను కలుస్తూ , తమకు అండ గా  ఉండాల్సిందిగా కోరుతూ వస్తున్నారు. 



దీనికోసం అభ్యర్థులు గట్టిగానే కష్టపడుతున్నారు. దీనికి తోడు పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని జనాల్లోకి తీసుకువెళ్తూ ప్రచారం చేయడం పైన అభ్యర్థులు దృష్టి పెట్టారు. గెలుపు కోసం అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టి, తామ కే ఓటు వేసే విధంగా చేసుకునేందుకు అన్ని రకాలుగాను తంటాలు పడుతున్నారు. కుల సంఘాలు, మహిళా సంఘాలు, కాలనీ కమిటీలు ఇలా అందరినీ ఉపయోగించుకుంటూ, వీరి ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే నిమిత్తం తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి తమ కుటుంబ సభ్యులను, బంధువులను రంగంలోకి దించి మరి ప్రచారం చేస్తున్నారు. 



ఇక పార్టీ బలహీనంగా ఉన్న చోట కీలక నాయకులు రంగంలోకి దింపి, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, ఆ ప్రాంతంలో రాజకీయ ప్రత్యర్థుల బలం, బలహీనతలు ఏమిటో తెలుసుకుని, వాటిని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ సంఘాల ద్వారా సొమ్ములు రహస్యంగా పంపిణీ చేస్తూ, ఓటర్ల ను తమ వైపు కు తిప్పుకునే ప్లాన్ చేసుకుంటున్నట్లుగానూ వార్తలు వస్తున్నాయి. పోలింగ్ సమయం దగ్గరకు వచ్చేస్తూ ఉండడంతో అన్ని పార్టీలు మరింత అప్రమత్తమైనట్టుగా కనిపిస్తున్నాయి.  



ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>