MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-thamanfb6da82a-3c07-4a4b-b6e4-dfbfce48b7b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-thamanfb6da82a-3c07-4a4b-b6e4-dfbfce48b7b2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా సర్కారు వారి పాట. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకులు అలానే అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. బ్యాంకు మోసాలు కుంభకోణాల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని ఎంతో భారీగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి అత్యున్నత సాంకేతిక విలsarkaru vaari paata;mahesh babu;mahesh;govinda;geetha;govi;parasuram;ram pothineni;thaman s;apherald;tollywood;cinema;sangeetha;rajani kanth;festival;heroine;success;posters;yuva;mythri movie makers;massఫ్యాన్స్ కోసం మహేష్ కాంప్రమైజ్ .... పండగే పండగ ..... ??ఫ్యాన్స్ కోసం మహేష్ కాంప్రమైజ్ .... పండగే పండగ ..... ??sarkaru vaari paata;mahesh babu;mahesh;govinda;geetha;govi;parasuram;ram pothineni;thaman s;apherald;tollywood;cinema;sangeetha;rajani kanth;festival;heroine;success;posters;yuva;mythri movie makers;massTue, 24 Nov 2020 23:50:10 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా సర్కారు వారి పాట. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకులు అలానే అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. బ్యాంకు మోసాలు కుంభకోణాల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని ఎంతో భారీగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తిసురేష్ నటిస్తుండగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు మది దీనికి ఫోటోగ్రఫీని అలానే యువ సంగీత తరంగం తమన్ దీనికి మ్యూజిక్ ని అందిస్తున్నాడు.  

ఇటీవల కెరీర్ పరంగా వరుసగా మూడు విజయాలు అందుకుని హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సర్కారు వారి పాటు తో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని ఇంకో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. మరో వైపు దర్శకుడు పరశురామ్ కూడా ఇందులోని మహేష్ బాబు పాత్రను ఎంతో అద్భుతంగా రాసుకున్నారని తెలుగు ప్రేక్షకులతో పాటు ముఖ్యంగా సూపర్ స్టార్ అభిమానులని ఆయన క్యారెక్టర్ ఎంతో అలరిస్తుందని అంటున్నారు.

ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాలనుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న  సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర పూర్తిగా మాస్ స్టైల్లో సాగుతుందని ఇప్పటివరకు మహేష్ కెరీర్లో ఇటువంటి పాత్ర చేయలేదని అంటున్నారు. నిజానికి మహేష్ బాబు అభిమానుల్లో కూడా ఆయన పూర్తిస్థాయి మాస్ పాత్రలో నటిస్తే చూడాలని ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. అయితే అది ఈ సినిమా ద్వారా తప్పనిసరిగా తీరుతుందని అలానే రిలీజ్ తర్వాత సర్కారు వారి పాట భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమే అయితే మాత్రం ఇది సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి అతి పెద్ద పండుగ వార్త అని చెప్పక తప్పదు....!!




బాబు అంటే వైసీపీ భయపడుతుందా? టీడీపీకి తోక ఉపయోగపడుతుందా?

RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>