PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp458413ae-9474-4c52-b6f9-71a10f833dbc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp458413ae-9474-4c52-b6f9-71a10f833dbc-415x250-IndiaHerald.jpgసాధారణంగా అధికార పార్టీలో ఆధిపత్య పోరు కాస్త ఎక్కువగానే ఉంటుంది. నేతల మధ్య సరైన సయోధ్య లేక పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు బాగా ఉంటుంది. అయితే ఈ పోరు వల్ల అధికార పార్టీకి డ్యామేజ్ జరిగి ప్రతిపక్షానికి కాస్త అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీలో ఆధిపత్య పోరు గట్టిగా ఉండేది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో పాటు, సొంత పార్టీలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సరిగా పడలేదు. దీని వల్ల ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. tdp;botcha satyanarayana;mp;police;mla;minister;chirala;ycp;tadikonda;thadikonda;k v ushashri charan;racchaబాబోయ్: ఈ లొల్లి ఏంది...టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందా?బాబోయ్: ఈ లొల్లి ఏంది...టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందా?tdp;botcha satyanarayana;mp;police;mla;minister;chirala;ycp;tadikonda;thadikonda;k v ushashri charan;racchaTue, 24 Nov 2020 01:00:00 GMT
ఇక ఇప్పుడు అధికారంలో వైసీపీ ఉంది. వైసీపీలో కూడా ఆధిపత్య పోరు గట్టిగానే సాగుతుంది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ బాగా ఉంది. ఉదాహరణకు చీరాల, గన్నవరం, నందికొట్కూరు, తాడికొండ ఇలా చెప్పుకుంటూ పోతే పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీ నేతలకు ఒకరంటే ఒకరికి పడటం లేదు.

తాజాగా అనంతపురం జిల్లాలో ఎంపీకి, ఓ ఎమ్మెల్యే వర్గాల మధ్య చిన్నపాటి రగడే నడుస్తోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ వర్గాల మధ్య గొడవ జరిగింది. కళ్యాణదుర్గం టీ సర్కిల్‌ వద్ద ఎంపీ రంగయ్య అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గీయులు తొలగించారు. అది గమనించిన ఎంపీ వర్గీయులు ఫ్లెక్సీలు తొలగించకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎంపీ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయంపై ఎంపీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

అటు మంత్రి బొత్స ఎదురుగానే కళ్యాణదుర్గం మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యే ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ వారు వేడుకున్నారు. ఇలా రాష్ట్రంలో చాలాచోట్ల అధికార పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక ఈ పోరు వల్ల టీడీపీకి భవిష్యత్‌లో అడ్వాంటేజ్ అవుతుందేమో చూడాలి.




ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>