MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pspk822b0ee7-8c57-4448-97f3-301750c11af4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pspk822b0ee7-8c57-4448-97f3-301750c11af4-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాల విషయంలో యమ దూకుడుని చూపిస్తున్నాడు. రాజకీయాల్లోంచి యూ టర్న్ తీసుకుని.. సినీ రంగంలో రీఎంట్రీ ఇచ్చిన పవన్... ఇప్పుడు వరుస చిత్రాలతో పెట్టి సినిమాలను ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్ ' సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ లాయర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఓ పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వpspk;beauty;pawan;boney kapoor;kalyan;kranthi;kranti;nidhi;pawan kalyan;sriram;makar sakranti;hyderabad;cinema;sankranthi;huzur nagar;kanna lakshminarayana;remake;venu sreeram;dookudu;dil;sai pallaviపవన్ - క్రిష్ సినిమాలో సాయి పల్లవి పాత్ర అదేనట..??పవన్ - క్రిష్ సినిమాలో సాయి పల్లవి పాత్ర అదేనట..??pspk;beauty;pawan;boney kapoor;kalyan;kranthi;kranti;nidhi;pawan kalyan;sriram;makar sakranti;hyderabad;cinema;sankranthi;huzur nagar;kanna lakshminarayana;remake;venu sreeram;dookudu;dil;sai pallaviTue, 24 Nov 2020 15:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాల విషయంలో యమ దూకుడుని చూపిస్తున్నాడు. రాజకీయాల్లోంచి యూ టర్న్ తీసుకుని.. సినీ రంగంలో రీఎంట్రీ ఇచ్చిన పవన్... ఇప్పుడు వరుస చిత్రాలతో పెట్టి సినిమాలను ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్ ' సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ లాయర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఓ పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. కరోనా తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఇక రీసెంట్‌గానే ఆయన 'వకీల్‌సాబ్‌' షూట్‌లో జాయిన్‌ అయ్యారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

వచ్చే సంక్రాంతి కి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ టీమ్. ఇక 'వకీల్‌సాబ్‌' సినిమా తర్వాత ఆయన ఏ సినిమా షూట్‌లో జాయిన్‌ అవుతారనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. రీసెంట్‌గా క్రిష్‌ బర్త్‌డే రోజు.. టీమ్‌ అంతా పవన్‌ని కలవడంతో.. 'వకీల్‌సాబ్‌' తర్వాత పవన్‌ ఖచ్చితంగా క్రిష్‌ సినిమానే చేస్తాడనేలా వార్తలు నడుస్తున్నాయి. పవన్‌ లుక్‌ కూడా ఈ సినిమా కోసం అనేలా మార్చాడు.ఇక ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నటిస్తుందనే విషయం తెలిసిందే.మరో హీరోయిన్‌గా ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ అంటూ వార్తలు నడిచాయి. కానీ తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి చేస్తుందని అంటున్నారు.

 అంతేకాదు..ఈ సినిమాలో ఆమె పాత్ర ఇదంటూ కొన్ని వార్తలు కూడా సంచరిస్తున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి జమీందారి కుటుంబ అమ్మాయిగా కనిపిస్తుందని అంటున్నారు. ఆమె పాత్ర సినిమాకి హైలెట్‌ అనేలా ఉంటుందని, అందుకే సాయిపల్లవిసినిమా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు.మరి ఇదే వార్త కనుక నిజం అయితే ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే. ఇక మరోవైపు పవన్ ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ లో నటిస్తాడనే వార్తలు కూడా ఫిల్మ్ నగర్ లో విపరీతంగా వినిపిస్తున్నాయి...! 


కరోనా వ్యాక్సిన్ ముందుగా వారికి మాత్రమే ఇస్తారట.. ఎందుకంటే?

అప్పుడే రంగంలోకి దిగిన టీడీపీ... శనివారమే...!

విశాఖ వైసీపీలో ఫోటోల చిచ్చు

అప్పుడు ఎందుకు ఇవ్వలేదు...? ఇప్పుడు ఎందుకు ఇస్తారు కేసీఆర్...?

వైసీపీలో తారస్థాయికి చేరిన ఎమ్మెల్యే, ఎంపీ విభేదాలు!

గర్భవతి తో సహజీవనం... తేడా రావడంతో ఆమె ప్రాణం పోయింది..??

కోహ్లీ లేకపోతే కష్టమే.. కానీ.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>