SatireMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgమొత్తానికి జనసేన పార్టీ పెద్ద త్యాగానికి దిగిపోయింది. గ్రేటర్ లో ఒంటరిగా సత్తా చాటుతామని గంభీరంగా ప్రకటించడంతో పాటు, కొంత మంది అభ్యర్థులతో నామినేషన్లు సైతం వేయించింది. ఇంకేముంది అటు బీజేపీ, ఇటు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు దీటుగా. జనసేన జెండా గ్రేటర్ లో ఎగిరిపోతుంది అని అంతా బోలెడు ఆశలు పెట్టుకోగా, చివరకు తుస్సు తుస్సు కనిపించారు. తమతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అక్కడ పోటీ చేస్తున్నా, అసలు ఏ మాత్రం వారిని లెక్కచేయకుండా, అసలు వారితో తమకు పని లేదు అన్నట్టుగా వ్యవహరించి మరీ పోటీకి దిగగా, ఏమయ్యా పవనpavan janasena bjp tirupathi ghmc;auto;pawan;kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;congress;cinema;tirupati;husband;letter;central government;janasena party;maha;partyసెటైర్ : పవన్ ఎవరి తాట తీస్తున్నారో ?సెటైర్ : పవన్ ఎవరి తాట తీస్తున్నారో ?pavan janasena bjp tirupathi ghmc;auto;pawan;kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;congress;cinema;tirupati;husband;letter;central government;janasena party;maha;partyTue, 24 Nov 2020 14:00:00 GMTమొత్తానికి జనసేన పార్టీ పెద్ద త్యాగానికి దిగిపోయింది. గ్రేటర్ లో ఒంటరిగా సత్తా చాటుతామని గంభీరంగా ప్రకటించడంతో పాటు,  కొంత మంది అభ్యర్థులతో నామినేషన్లు సైతం వేయించింది. ఇంకేముంది అటు బీజేపీ, ఇటు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు దీటుగా. జనసేన జెండా గ్రేటర్ లో ఎగిరిపోతుంది అని అంతా బోలెడు ఆశలు పెట్టుకోగా, చివరకు తుస్సు తుస్సు కనిపించారు. తమతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అక్కడ పోటీ చేస్తున్నా, అసలు ఏ మాత్రం వారిని లెక్కచేయకుండా, అసలు వారితో తమకు పని లేదు అన్నట్టుగా వ్యవహరించి మరీ పోటీకి దిగగా, ఏమయ్యా పవన్ అసలు మాతో ఏపీ లో పొత్తు పెట్టుకుని, చివరకు మళ్లీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తాను అంటావా ?  అసలు ఇది న్యాయమా ధర్మమా అంటూ రిక్వెస్ట్ తో కూడిన బెదిరింపు చేసేసరికి ,ఎందుకు వచ్చిన తంటాలే అనుకుంటూ గ్రేటర్ లో దుకాణం మూసేసారు. 



అప్పటివరకు బిజెపి పై దండయాత్ర అంటూ హడావుడి చేసి,  చివరకు ఆ పార్టీకి అర్జెంటుగా సైనికులందరూ మద్దతు ఇచ్చి గెలిపించాలని ఒక ప్రకటన చేశారు. దీంతో అసలు మా పవన్ కళ్యాణ్ ఎంత మంచి వా డో అంటూ బీజేపీ నేతలు 4 పొగడ్తలు పొగిడేశారు. ఆ సీన్ అక్కడితో కట్ చేస్తే , పవన్ ఇప్పుడు ఢిల్లీలో తేలారు. కేంద్ర బిజెపి అందరిని కలిసి గ్రేటర్ లో మేం చేసిన త్యాగం గుర్తించి ఏపీలోని తిరుపతిలో మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వండి మహా ప్రభో అంటూ వినతి తో కూడిన డిమాండ్ చేసేందుకు మనోహరుడితో పవన్ డిల్లీ లో చక్కర్లు కొడుతున్నారు.



 తిరుపతి టికెట్ జనసేనకి అనే హామీ ఇచ్చే వరకు తాను ఊరుకునేది లేదు అంటూ పవన్ కొత్త షరతులు ఎన్నో విధిస్తూ , ప్రస్తుతం హడావుడి చేస్తున్నారట. ఒకవేళ ససేమిరా అంటూ బీజేపీ నాయకులు మొండికేస్తే, తాట తీస్తా అని సినిమా డైలాగులు సైతం పలికేందుకు కూడా పవన్ సిద్దం అయ్యే ఢిల్లీకి వెళ్లారు అంటూ ఇక్కడ సైనికులు హడావుడి చేసేస్తున్నారు..



అప్పుడే రంగంలోకి దిగిన టీడీపీ... శనివారమే...!

విశాఖ వైసీపీలో ఫోటోల చిచ్చు

అప్పుడు ఎందుకు ఇవ్వలేదు...? ఇప్పుడు ఎందుకు ఇస్తారు కేసీఆర్...?

వైసీపీలో తారస్థాయికి చేరిన ఎమ్మెల్యే, ఎంపీ విభేదాలు!

గర్భవతి తో సహజీవనం... తేడా రావడంతో ఆమె ప్రాణం పోయింది..??

కోహ్లీ లేకపోతే కష్టమే.. కానీ.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..?

బుల్లిపిట్ట: గడియారంపై ఫోన్ పెడితే చాలు.. చార్జింగ్ ఎక్కేస్తుంది!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>