PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tolly34d9b486-23c6-41df-ac08-decd7e818c3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tolly34d9b486-23c6-41df-ac08-decd7e818c3b-415x250-IndiaHerald.jpgసినిమాలకు రాజకీయాలకు మధ్యన ఉన్న సన్నని గీత ఎపుడో చెరిపోయింది. నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలూ సినిమా తళుకు బెళుకులూ కలగాపులగంగా కలసిపోయాయి. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా సినిమా తారలను ఉపయోగించుకుంటారు. వారు కూడా రంగంలోకి దిగి తన అభిప్రాయం చెప్పేస్తున్నారు. ఇక సినిమాలో రిటైర్ అయిన వారు, అక్కడ అవకాశాలు రాని వారు రాజకీయాల్లో ప్రత్యక్షం అవుతున్నారు.tolly;kcr;vijayashanti;editor mohan;geetha;kavitha;murali;shankar;tara;hyderabad;bharatiya janata party;tollywood;industries;cinema;media;heroine;partyగ్రేటర్ ఎన్నికల్లో టాలీవుడ్ మద్దతు ఎటు ?గ్రేటర్ ఎన్నికల్లో టాలీవుడ్ మద్దతు ఎటు ?tolly;kcr;vijayashanti;editor mohan;geetha;kavitha;murali;shankar;tara;hyderabad;bharatiya janata party;tollywood;industries;cinema;media;heroine;partyTue, 24 Nov 2020 20:00:00 GMTగీత ఎపుడో చెరిపోయింది. నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలూ సినిమా తళుకు బెళుకులూ కలగాపులగంగా కలసిపోయాయి. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా సినిమా తారలను ఉపయోగించుకుంటారు. వారు కూడా రంగంలోకి దిగి తన అభిప్రాయం చెప్పేస్తున్నారు. ఇక సినిమాలో రిటైర్ అయిన వారు, అక్కడ అవకాశాలు రాని వారు రాజకీయాల్లో ప్రత్యక్షం అవుతున్నారు.

ఇపుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో టాలీవుడ్ ఎటువైపు అన్నది పెద్ద ఎత్తున చర్చగా ఉంది. నిజానికి టాలీవుడ్ లో ఆంధ్రా మూలాలు కలిగిన వారే నూటికి తొంబై శాతం ఉన్నారు. అయితే టాలీవుడ్ పరిశ్రమ హైదారాబాద్ లో స్థిరపడడంతో సినీ జనాలు కూడా ఏ రోటి కాడ ఆ పాట పాడుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని హైదరాబాద్ లో నిర్మిస్తానని కేసీయార్ ప్రకటించారని ప్రచారం సాగుతోంది.

దాంతో సహజంగానే టాలీవుడ్ మద్దతు అధికార పార్టీకి ఉంటుంది అని అంటున్నారు. ఇక మరో వైపు టీయారెస్ ని సవాల్ చేస్తూ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దూసుకువస్తోంది.ఆ పార్టీ తరఫున ప్రముఖ సినీ తారలు లేకపోయినా ఆ లోటుని భర్తీ చేయడానికి విజయశాంతి రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. ఆమె రేపో నేడో బీజేపీ తీర్ధం పుచ్చుకుని కార్యరంగంలోకి దూకుతారు అంటున్నారు. ఇక బీజేపీ తరఫున అలనాటి హీరోయిన్ కవిత మీడియా ముఖంగా ప్రచారం చేస్తున్నారు. హాస్య నటుడు బాబూ మోహన్ అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు.

ఇక టీయారెస్ కి బాహాటంగా నటుడు పోసాని క్రిష్ణ మురళి మద్దతు ప్రకటించారు. అలాగే దర్శకుడు శంకర్ కూడా టీయారెస్ ని గెలిపించాలని కోరుతున్నారు. మొత్తానికి చూసుకుంటే టాలీవుడ్ లో మెజారిటీ అంతా టీయారెస్ గెలుపు కోసం పనిచేస్తోందని అంటున్నారు. చూడాలి మరి అటూ ఇటూ సినీ గ్లామర్ ఉంటే ఆ  హడావుడే వేరుగా ఉంటుందిగా.






పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ భామ ఫిక్స్ ..... ఏ సినిమాలో అంటే ...??

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

తమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>