MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/hero-prabhas-crazy-about-one-thing-in-his-moviesb57d99a3-2137-41be-8f49-1ce30085dac3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/hero-prabhas-crazy-about-one-thing-in-his-moviesb57d99a3-2137-41be-8f49-1ce30085dac3-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తుండగా కృష్ణంరాజు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇతర పాత్రల్లో ప్రియదర్శి, షాషా చత్రి తదితరులు నటిస్తుండగా ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ని మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. radhe shyam;prabhas;prabhas;bhagyashree;kumaar;pooja hegde;krishna;krishnam raju;prema;priyadarshi;apherald;bollywood;tollywood;cinema;festival;radha krishna kumar;love;heroine;europe countries;success;posters;nijam;vemuri radhakrishna;v'రాధేశ్యామ్' విషయమై ప్రచారమవుతున్న ఆ రూమర్ నిజమేనా .... ??'రాధేశ్యామ్' విషయమై ప్రచారమవుతున్న ఆ రూమర్ నిజమేనా .... ??radhe shyam;prabhas;prabhas;bhagyashree;kumaar;pooja hegde;krishna;krishnam raju;prema;priyadarshi;apherald;bollywood;tollywood;cinema;festival;radha krishna kumar;love;heroine;europe countries;success;posters;nijam;vemuri radhakrishna;vTue, 24 Nov 2020 19:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తుండగా కృష్ణంరాజు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇతర పాత్రల్లో ప్రియదర్శి, షాషా చత్రి తదితరులు నటిస్తుండగా ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ని మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో జరగనుందని దానితో సినిమా మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన రిట్రో ప్రేమ కథగా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవల్లో తెరకెక్కిస్తున్నట్లు టాక్. హృద్యమైన ప్రేమ కథగా పలు ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందని సమాచారం. గత ఏడాది సాహూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ దానితో ఆశించిన రేంజ్ సక్సెస్ ని అయితే అందుకోలేకపోయారు. దానితో ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్ తో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని కసితో ప్రభాస్ పని చేస్తున్నారట.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మంచి స్పందన సంపాదించి సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అతి త్వరలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలోని కీలకమైన ఎపిసోడ్స్ లో క్లైమాక్స్ ఒకటని, ఆ ఎపిసోడ్లో ప్రభాస్ నటన అలానే ఎమోషనల్ గా సాగే సన్నివేశాలు ప్రేక్షకులు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటాయని సమాచారం. ఇక రిలీజ్ తర్వాత సినిమా కూడా తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుందని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రచారమవుతోన్న  ఈ వార్త నిజమే అయితే ఇది నిజంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్త అని చెప్పక తప్పదు.....!!




సోము వీర్రాజు పూనకం మైక్ ముందేనా..?

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

తమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>