SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/karthika-masam-updatesc5b2074e-7bba-4db7-a11e-3b1d0eec0398-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/karthika-masam-updatesc5b2074e-7bba-4db7-a11e-3b1d0eec0398-415x250-IndiaHerald.jpgకార్తీక మాసం అంటేనే శివ పార్వతులకు ప్రీతి కరమైన మాసం. ఈ నెలలో పరమశివుని భక్తులంతా ఎంతో నియమ నిష్ఠలతో స్వామిని కొలుస్తారు. తమ కోరికలను ఆయనతో చెప్పుకుంటారు. ఈ మాసంలో ఒక్కొరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉండడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో కొంతమంది శివ మాల ధరించి భక్తి శ్రద్దలతో ఆయననే ఆరాధిస్తూ ఉంటారు.శివును పూజ చేయడానికి ఎన్నో మంత్రాలు మరియు పూజ విధానాలు ఉన్న వేటిల్లవే ప్రత్యేకం. అయితే లింగాష్టకం ను అనునయిస్తూ శివుడ్ని స్తుతించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ లింగాష్టకం లో ఏమి ఉంటుందో.karthika masam updates;sada;shiva;prithy;lord siva;mahaమహా శివుని లింగాష్టకం మహత్యం...!మహా శివుని లింగాష్టకం మహత్యం...!karthika masam updates;sada;shiva;prithy;lord siva;mahaTue, 24 Nov 2020 06:00:00 GMTశివ పార్వతులకు ప్రీతి కరమైన మాసం. ఈ నెలలో పరమశివుని భక్తులంతా ఎంతో నియమ నిష్ఠలతో స్వామిని కొలుస్తారు. తమ కోరికలను ఆయనతో చెప్పుకుంటారు. ఈ మాసంలో ఒక్కొరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉండడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో కొంతమంది శివ మాల ధరించి భక్తి శ్రద్దలతో ఆయననే ఆరాధిస్తూ ఉంటారు. ఈ నెల రోజుల పాటు శివుని దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోతాయి.

శివును పూజ చేయడానికి ఎన్నో మంత్రాలు మరియు పూజ విధానాలు ఉన్న వేటిల్లవే ప్రత్యేకం. అయితే లింగాష్టకం ను అనునయిస్తూ శివుడ్ని స్తుతించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ లింగాష్టకం లో ఏమి ఉంటుందో...దీనివలన శివునికి కలిగే ఆనందం ఏమిటో తెలుసుకోవాలనుందో అయితే కింద ఇచ్చిన శివుని లింగాష్టకం ను ఒకసారి చదవండి. మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది.  

1. బ్రహ్మమురారిసురార్చిత లింగం – నిర్మలభాసితశోభితలింగం |
జన్మజదు:ఖవినాశకలింగం – తత్ప్రణమామి సదాశివలింగమ్‌.
2. దేవమునిప్రవరార్చితలింగం – కామదహన కరుణాకరలింగం |
రావణదర్పవినాశకలింగం – తత్ప్రణమామి సదాశివలింగమ్‌.
3. సర్వసుగంధి సులేపితలింగం – బుద్దివివర్ధనకారణలింగం |
సిద్దసురాసురవందిత లింగం – త త్ప్రణమామి సదాశివలింగమ్‌
4. కనకమహామణి భూషితలింగం – ఫణిపతివేష్ఠితశోభితలింగం |
దక్షసుయజ్ఞవినాశనలింగం – తత్ప్రణమామి సదా శివలింగమ్‌.
5. కుంకుమచందనలేపితలింగం – పంకజహారసుశోభితలింగం |
సంచిత పాపవినాశనలింగం – తత్ప్రణమామి సదాశివలింగమ్‌.
6. దేవగణార్చితసేవితలింగం – భావైర్భక్తిభి రేవ చ లింగం |
దినకరకోటి ప్రభాకరలింగం – తత్ప్రణమామి సదాశివలింగ మ్‌.
7. అష్టదళోపరివేష్టితలింగం – సర్వసముద్భవకారణలింగం |
అష్టదరిద్రవినాశనలింగం – తత్ప్రణమామి సదాశివలింగమ్‌.
8. సురగురు సురవరపూజితలింగం – సురవరపుష్పసదార్చితలింగం |
పరమపరం పరమాత్మకలింగం – తత్ప్రణమామి సదాశివలింగమ్‌.
లింగాష్టక మిదం పుణ్యం – య:పఠే చ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి – శివేన సహ మోదతే.

పై విధంగా ప్రతిరోజు శివుని ఎదుట పూజిస్తే మీరు అనుకున్నవి సిద్ధిస్తాయి. అంతేకాకుండా మీకు వేయి జన్మల పుణ్యం లభిస్తుంది.


న‌వంబ‌ర్ 24వ ‌తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>