MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-rashmika-got-a-chance-in-kollywood172ca53c-e9a4-4dcd-9e0d-f7f07e785ffb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-rashmika-got-a-chance-in-kollywood172ca53c-e9a4-4dcd-9e0d-f7f07e785ffb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో రష్మీక మందన్న ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ బ్యూటీ ..తెలుగులో నాగ శౌర్య సరసన చలో సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అక్కడితో ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు దక్కడం.. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్లు సాధించి..ఏకంగా టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలలో సైతం ఎప్పుడూ చురుగ్గా ఉంటూ.. తన అభిమానులతో దగ్గరవుతూ వస్తోన్న రష్మీక.. ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఈ ఏడాదికి మrashmika mandhanna;beauty;mahesh;karthik;kumaar;allu arjun;naga;naga shourya;rashmika mandanna;sukumar;surya sivakumar;tollywood;industries;cinema;telugu;naga aswin;kollywood;tamil;kannada;karthik siva kumar;hero;girl;arjun 1;nithin reddy;wanted;sultanతమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!తమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!rashmika mandhanna;beauty;mahesh;karthik;kumaar;allu arjun;naga;naga shourya;rashmika mandanna;sukumar;surya sivakumar;tollywood;industries;cinema;telugu;naga aswin;kollywood;tamil;kannada;karthik siva kumar;hero;girl;arjun 1;nithin reddy;wanted;sultanTue, 24 Nov 2020 17:00:00 GMTటాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో రష్మీక మందన్న ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ బ్యూటీ ..తెలుగులో నాగ శౌర్య సరసన చలో సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అక్కడితో ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు దక్కడం.. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్లు సాధించి..ఏకంగా టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలలో సైతం ఎప్పుడూ చురుగ్గా ఉంటూ.. తన అభిమానులతో దగ్గరవుతూ వస్తోన్న రష్మీక.. ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసింది. ముఖ్యంగా  ఈ ఏడాదికి మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు,నితిన్ భీష్మ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకొని.. తన ప్రస్తుత సినిమాలకు హై రేంజ్ లో పారితోషకాన్ని అందుకుంటోంది.

 ఇక మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం రష్మీక ఒక్క సినిమాకు దాదాపు రెండు కోట్ల వరకు తీసుకుంటోందట. ఇదిలా ఉంటె రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది.ఇక తెలుగులో ఫుల్ క్రేజ్ ను సంపాదించిన ఈ అమ్మడు.. త్వరలోనే కోలీవుడ్ ఇండ్రస్టీ లో ఎంట్రీ ఇవ్వనుంది. కార్తి సరసన సుల్తాన్ అనే సినిమాతో కోలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది రష్మీక. 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.తాజా సమాచారం ప్రకారం రష్మికకు కోలీవుడ్‌లో మొదటి సినిమా విడుదలవక ముందే మరో క్రేజీ ఆఫర్‌ వరించిందట.

కార్తి సోదరుడు, ప్రముఖ హీరో సూర్య సరసన రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. పాండిరాజ్‌, సూర్య కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోతోంది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్‌గా రష్మికను అనుకుంటున్నారట.సూర్యతో జోడీ కట్టేందుకు రష్మిక కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోందట. ఈ కాంబినేషన్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందట.ఇక ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన రష్మీక.. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలు చేయనుందని సినీ వర్గాల్లో తాజాగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి...!!


హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరినీళ్లలా మారుస్తామన్నారే ఏమైంది?: ఉత్తమ్

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

'కే‌సి‌ఆర్' ను పొగడ్తలతో ముంచిన 'మహేష్ బాబు'..!!

అప్పుడే రంగంలోకి దిగిన టీడీపీ... శనివారమే...!

విశాఖ వైసీపీలో ఫోటోల చిచ్చు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>