MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/katrinakaif9b9b6b58-230c-47f3-9f96-6b2aef55c989-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/katrinakaif9b9b6b58-230c-47f3-9f96-6b2aef55c989-415x250-IndiaHerald.jpgకరోనా తర్వాత మళ్లీ చిత్ర పరిశ్రమ బిజీ బిజీగా గడుపుతోంది. ఒక్కో సినిమా షూటింగు షెడ్యూల్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ సమయంలో నటీనటులు అందరికీ కరోనా టెస్ట్ కంపల్సరీ అయ్యింది. ఈ విషయంలో అగ్ర తారలు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. తెలుగులో మల్లీశ్వరి చిత్రంలో ‘ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపురం’గా మనసులు దోచుకున్న కత్రినా కైఫ్.. ఆ తర్వాత బాలీవుడ్‌లో అద్భుతాలు సృష్టించింది. తన అంద చందాలతో పాటు అభినయం, డ్యాన్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇప్పుడు బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఆమె కూడా ఒకరు.katrinakaif;beauty;akshay kumar;katrina kaif;kumaar;rohit shetty;salman khan;abinaya;akshay;ishaan actor;rohit;india;bollywood;industries;cinema;telugu;smart phone;director;comedy;hero;heroine;sooryavanshi;zero;malliswari;sharukh khan;chitramకత్రినాకు కరోనా టెస్టు.. వీడియో షేర్ చేసిన హాట్ బ్యూటీ!కత్రినాకు కరోనా టెస్టు.. వీడియో షేర్ చేసిన హాట్ బ్యూటీ!katrinakaif;beauty;akshay kumar;katrina kaif;kumaar;rohit shetty;salman khan;abinaya;akshay;ishaan actor;rohit;india;bollywood;industries;cinema;telugu;smart phone;director;comedy;hero;heroine;sooryavanshi;zero;malliswari;sharukh khan;chitramMon, 23 Nov 2020 11:14:00 GMTపరిశ్రమ బిజీ బిజీగా గడుపుతోంది. ఒక్కో సినిమా షూటింగు షెడ్యూల్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ సమయంలో నటీనటులు అందరికీ కరోనా టెస్ట్ కంపల్సరీ అయ్యింది. ఈ విషయంలో అగ్ర తారలు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. తెలుగులో మల్లీశ్వరి చిత్రంలో ‘ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపురం’గా మనసులు దోచుకున్న కత్రినా కైఫ్.. ఆ తర్వాత బాలీవుడ్‌లో అద్భుతాలు సృష్టించింది. తన అంద చందాలతో పాటు అభినయం, డ్యాన్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇప్పుడు బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఆమె కూడా ఒకరు.

షూటింగులు ప్రారంభించే ముందు ఆమె కూడా కరోనా టెస్టు చేయించుకుంది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న ఆమె.. ఇక్కడే కరోనా టెస్టు చేయించుకుంటూ ఫొటోలు దిగింది. ఓ ఫొటోషూట్ కోసం ఆమె ఇక్కడకు వచ్చింది. తాను కరోనా టెస్టు చేయించుకున్న వీడియోను కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆమె.. కరోనా టెస్టు కోసం మ్యూకస్ ఇస్తూ కనిపించింది. ప్రస్తుతం కత్రినా చాలా బిజీగా ఉంది. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సూర్యవంశీ’లో నటించనుంది. కాప్ యాక్షన్ డ్రామా అయిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరో. ఆ తర్వాత సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖత్తర్‌ తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ఫోన్ బూత్ చిత్రం కూడా సైన్ చేసింది.

బాలీవుడ్ అందాల తారగా వెలుగొందుతున్న ఈ 37 ఏళ్ల హీరోయిన్.. ఇటీవలి కాలంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎక్కువగా ఎంచుకుంటోంది. సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గతేడాది షారుఖ్ చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘జీరో’లో నటనతో మెప్పించింది. ఆ తర్వాత మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘భారత్’ సినిమాలో కూడా అద్భుతంగా నటించింది. అయితే ఈ రెండు సినిమాలూ బాక్సాఫీసు వద్ద ఆశించినంతగా కాసులు రాల్చలేదు. దీంతో ఆమె రాబోయే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.





జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>